Wedding called off over alleged demand to serve beef బీఫ్ కావాలన్న వరుడు.. పెళ్లి వద్దన్న వదువు..

Wedding called off over alleged demand to serve beef ssp orders probe

wedding,Wedding called off,ssp,Dowry,demand to serve beef,bareilly, beef ban in Uttar pradesh, crime

A wedding was called off in Moradabad after the bride’s family refused to accept the alleged demand of the groom’s family to serve beef at the ceremony.

బీఫ్ కావాలన్న వరుడు.. పెళ్లి వద్దన్న వదువు..

Posted: 01/05/2019 06:33 PM IST
Wedding called off over alleged demand to serve beef ssp orders probe

బీఫ్ వండుకున్నారనే కారణంగా గ్రామస్థులపై దాడులు చేయడం, బీఫ్ విక్రయిస్తున్నవారిని చితకబాదడం వంటి సంఘటనలు కొన్నిరోజుల కిందట వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటికీ విభిన్నమైనదీ సంఘటన. పెళ్లి విందులో ‘బీఫ్’ కచ్ఛితంగా వడ్డించాలని డిమాండ్ చేసినందుకు, వరుడితో వివాహాన్నే క్యాన్సిల్ చేసుకుందో వధువు. అలాగని ఆ అమ్మాయి హిందు కుటుంబానికి చెందినది కూడా కాదు. ఓ ముస్లీం యువతి. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ సిటీకి దగ్గర్లో ఉన్న సిసౌటా గ్రామానికి చెందిన అస్గర్ అలీ తన కూమార్తెను, అదే గ్రామానికి చెందిన నసీం అలీ కుమారుడైన నజీమ్‌కు ఇచ్చి నిఖా జరిపించేందుకు నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా నిర్వహించి... వరుడికి ఉంగరం తొడిగి, పెళ్లి బట్టలు కూడా మార్చుకున్నారు. ఈ నెల 28న పెళ్లి జరిపించాలని నిఖాకి ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే పెళ్లి విందులో బీఫ్ పెట్టాలని వరుడు నజీమ్, వధువు కుటుంబీకులను డిమాండ్ చేశాడు. రూ. 5 లక్షలు కట్నం, కారు కట్నంగా ఇవ్వాలని కోరాడు.

కట్నం, కారు ఇచ్చేందుకు ఒప్పుకున్న వధువు కుటుంబం, బీఫ్ వడ్డించేందుకు మాత్రం ససేమీరా అనేసింది. అయితే బీఫ్ కచ్చితంగా ఉండాల్సిందే అని వరుడి కుటుంబం డిమాండ్ చేయడంతో... పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది వధువు. నిఖాకి ముహుర్తం పెట్టుకున్న తర్వాత వింత కోరికలు కోరిన వరుడి కుటుంబీకులపై వధువు తండ్రి అస్గర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌పై బీఫ్‌పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నజీమ్ కుటుంబీకులు చెబుతుండడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wedding  Wedding called off  ssp  Dowry  demand to serve beef  bareilly  beef ban in Uttar pradesh  crime  

Other Articles