Alert: Non-CTS compliant cheques will be dishonoured అలర్ట్: జనవరి 1 నుంచి మీ చెక్కులు చెల్లవు..

Alert non cts compliant cheques will be dishonoured

atm card, bank, cheque books, Cheque Truncation System, CTS cheques, credit card, debit card, income tax return itr, itr filing

Bank customers will have to get their non-CTS compliant cheques replaced as these instruments will not be accepted for clearance in the banking system from January 1, 2019.

అలర్ట్: జనవరి 1 నుంచి మీ చెక్కులు చెల్లవు..

Posted: 12/28/2018 04:30 PM IST
Alert non cts compliant cheques will be dishonoured

మీరు గృహరుణం తీసుకోవాలనుకుంటున్నారా.? లేక కొత్త కారు కోనే యోచనలో వున్నారా.? లేక తరచూ చెక్కులతో ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారా? ఇందుకోసం మీ చెక్కులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ కోసం ఇస్తున్నారా.? అయినా అవి ఇకపై చెల్లుబాటు కావు. మీకు బ్యాంకు నుంచి మీ చెక్కు రిజెక్ట్ చేయబడిందని మెసేజ్ రాకముందే.. మీరు అప్రమత్తం కావాలి. ఇప్పటికీ మీ దగ్గర పాత చెక్ బుక్ ఉంటే వాటిని ఏం చేయాలన్న అలోచనల మీలో రేకెత్తుతుందా.? మీరు పాత చెక్ బుక్స్ మార్చుకొని సీటీఎస్-2010 స్టాండర్డ్ చెక్ బుక్స్ తీసుకోకపోతే చిక్కులు తప్పవు. ఎందుకంటే..

* చెక్కులతో అనేక మోసాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీటీస్-2010 స్టాండర్డ్ చెక్కుల్ని ప్రవేశపెట్టింది.
* ఇప్పటికీ నాన్-సీటీఎస్ చెక్కుల్ని ఉపయోగిస్తున్నవాళ్లు ఉన్నారు. చాలామంది తమ పాత చెక్ బుక్స్‌ని సీటీఎస్-2010 చెక్ బుక్స్‌కి మార్చుకోలేదు.
* 2019 జనవరి 1 నుంచి నాన్-సీటీఎస్ చెక్కుల్ని బ్యాంకులు అనుమతించకపోవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ, పీఎన్‌బీ లాంటి పెద్దపెద్ద బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.
* ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం నాన్-సీటీఎస్ చెక్స్‌ని ప్రతీ నెల రెండో బుధవారం మాత్రమే అనుమతిస్తాం. 31-12-18 తర్వాత అలాంటి చెక్స్ అనుమతించం" అని సెప్టెంబర్‌లోనే ప్రకటన విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
* నాన్-సీటీఎస్, సీటీఎస్-2010 చెక్ బుక్స్ మధ్య తేడాలేంటీ? సీటీఎస్-2010 చెక్ లీఫ్స్ లేని బుక్స్‌ని నాన్-సీటీఎస్ చెక్ బుక్స్ అంటారు. సీటీఎస్-2010 చెక్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆప్టికల్/ఇమేజ్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది. నాన్-సీటీఎస్ టెక్నాలజీలో ఈ ఫీచర్లు ఉండవు.
* సీటీఎస్-2010 ఉపయోగమేంటీ?: మీరు బ్యాంకులో నాన్-సీటీఎస్ చెక్ ఇచ్చారంటే... సదరు బ్యాంకు సిబ్బంది ఆ చెక్కును సంబంధిత బ్యాంకుకు పంపి క్లియరెన్స్ పొందాల్సి ఉండేది. ఇందుకోసం 3 నుంచి 7 రోజుల సమయం పట్టేది. అదే సీటీఎస్-2010 చెక్ అయితే ఆ ఇమేజ్‌ను సంబంధిత బ్యాంకుకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. చెక్ ఇష్యూయింగ్ బ్యాంక్ నుంచి వెంటనే క్లియరెన్స్ వస్తుంది. ఇదంతా ఒక్కరోజులో జరిగిపోతుంది.
* సీటీఎస్-2010 చెక్స్ ఎలా గుర్తించాలి?: చెక్కుపై బ్యాంకు లోగో ఇన్విజిబుల్ ఇంక్‌(అల్ట్రా వయొలెట్‌)తో ప్రింట్ చేసి ఉంటుంది. చెక్కుపైన స్పెషల్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ చెక్కును డూప్లికేట్ చేయడానికి రాదు. చెక్కుపైన రుపీ సింబల్ కూడా ఉంటుంది.
* సీటీఎస్-2010 చెక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డార్క్ కలర్ ఇంక్‌తో పేరు, అమౌంట్ రాయాలి. సంతకం చేయాలి.
* మీ దగ్గర నాన్-సీటీఎస్ చెక్ బుక్స్ ఉంటే, బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. లేకపోతే వచ్చే నెల నుంచి ఆ చెక్కులు బౌన్స్ అయ్యే ప్రమాదముంది.
* ఒక వేళ మీరు లోన్ రీపేమెంట్ కోసం నాన్-సీటీఎస్ పోస్ట్-డేటెడ్ చెక్స్ ఇచ్చినట్టయితే సీటీఎస్-2010 స్టాండర్డ్ చెక్స్‌కి మార్చాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles