principal arrested for sexual harassing students విద్యార్థులపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్ అరెస్ట్

Principal arrested for sexual harassing students

sexual harassment, Geetanjali college, Eshwara dattu, Prinicipal, Sexually harassement, Students, Yelamanchili, vizag, Andhra Pradesh, crime

The principal of a Private Intermiediate and degree college in yelamanchili of vishakapatnam had been arrested by the vishakapatnam police, who had allegedly been harassing his college hostel students for sexual favours.

విద్యార్థులపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్ అరెస్ట్

Posted: 12/28/2018 11:56 AM IST
Principal arrested for sexual harassing students

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులూ తమ కూతుళ్ల వయస్సున్న వారిపై కామవాంఛతో తెగబడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. గురు దేవో మహేశ్వరహా: అంటూ గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి గల సమాజం మనదన్న విషయాన్ని కూడా మర్చిపోతున్న గురువు.. తమ విద్యార్థులను కోరిక తీర్చాలంటూ వేధించిన ఘటన విశాఖ జిల్లా యలమంచలిలో చోటుచేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటోన్న విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌ ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ రోడ్డులో గీతాంజలి డిగ్రీ, ఇంటర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన పీవీఎస్ ఈశ్వరదత్తు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్, సెక్రటరీగా ఉంటున్నాడు. డిసెంబరు12న రాత్రి సమయంలో కొంతమంది విద్యార్థినులను తన గదికి పిలిపించుకున్న ఈశ్వరదత్తు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని, మాట వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడు.

అంతేకాదు తన మాట విని కోరికను తీర్చకపోతే భవిష్యత్తులో ఎక్కడా చదువుకోకుండా చేస్తానని వారిని ఈశ్వరదత్తు హెచ్చరించాడు. కీచక గురువు బారి నుంచి ఎలాగో తప్పించుకున్న విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. తీవ్ర మనోవేధనకు గురైన తమ పిల్లల పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను చెడగొట్టి మనోవేధనకు గురిచేసిన కీచక ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్థారించుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ ఈశ్వరదత్తును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై భారత శిక్షాస్మృతిలోని 354,354డి, పోక్సో 8, 12 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా అతడికి 15 రోజుల రిమాండ్ విధించారు. ఇదే అంశంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన నిర్వహించి.. ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles