Mahesh Babu's bank accounts frozen మహేష్ బాబుకు జీఎస్టీ షాక్.. అకౌంట్లు సీజ్..

Actor mahesh babu s bank accounts frozen over tax dues

Telugu superstar, tollywood prince, Mahesh Babu, GST, Goods and Services Tax department, ICICI Bank, Axis Bank

The Goods and Services Tax department said it has attached the bank accounts of Telugu superstar Mahesh Babu to recover service tax dues from him.

మహేష్ బాబుకు జీఎస్టీ షాక్.. అకౌంట్లు సీజ్..

Posted: 12/28/2018 11:24 AM IST
Actor mahesh babu s bank accounts frozen over tax dues

ప్రముఖ హీరో, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. ఆయన పన్ను బకాయిలు పడ్డారని ఏకంగా అయన అకౌంట్లను సీజ్ చేసింది. గత తొమ్మిదేళ్లుగా ఎగవేస్తున్న పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ వున్న సూపర్ స్టార్ అభిమానులను ఈ వార్త కలవర్చింది.  

వివరాల్లోకి వెళ్తే గత తొమ్మిదేళ్ల కాలంగా వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించి ప్రమోట్ చేసిన టాలీవుడ్ ప్రిన్స్.. వారి నుంచి పొందిన పారితోషకాన్ని పోంది తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ లాభాలపై మాత్రం మహేష్ బాబు అందించిన సేవలకు గాను లభించిన మొత్తంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని పేర్కొంది.

ఈ మేరకు మహేష్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2007-2008 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని తెలిపింది. పన్ను, జరిమానా, వడ్డీల రూపంలో మొత్తం రూ.73.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసినట్టు జీఎస్టీ కమిషనరేట్ ప్రకటనలో పేర్కొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles