special guests to temples of Telangana తెలంగాణ దేవాలయాల్లో ‘ప్రత్యేక’ అతిధులు

Telangana temples in news with garuda birds visit

telangana temples, korutla temple, sri venkateshwara swamy, shivaling, nizambad, garuda birds, telangana

korutla and Nizamabad Temples of Telangana are in news recently the news of garuda birds visit, Devotees throng temples and performed pujas to them.

తెలంగాణ దేవాలయాల్లో ‘ప్రత్యేక’ అతిధులు

Posted: 12/26/2018 10:36 AM IST
Telangana temples in news with garuda birds visit

తెలంగాణ ఆలయాల్లోని దేవతామూర్తుల చెంతకు గరుడ పక్షులు చేరి తమ భక్తివిశ్వాసాలను చాటుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సకల చరాచర సృష్టిలో అన్ని ప్రాణులు, పర్వతాలు, చెట్లు, చేమలు, పంచబూతాలకు దైవమే అధిపతి అని భక్తులు విశ్వసిస్తారు. దైవం అజ్ఞలేనిదే ఏదీ జరగదని కూడా అంటుంటారు. ఆ మధ్యకాలంలో పాము, రామచిలుక, వరాహం, నెమలి, పిచ్చుకలు దేవాలాయాల్లోని విగ్రహామూర్తులపై వాలి అక్కడే పలు రోజులు వుండటం.. అది కాస్తా వార్తలుగా మారిన విషయం తెలిసిందే.

అయితే కేవలం మహా సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప స్వామి అభరణాలను తీసుకువచ్చే సమయంలో మాత్రమే రక్షణగా వచ్చే గరుడ పక్షి గగనంలో విహరించడం చూస్తూనే వున్నాం. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలోని దేవాలయాల్లో గరుడపక్షులు వచ్చి దేవుడి శరణుకోరడమే చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం కోరు్ట్లలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని విగ్రహం వద్ద ఓ గరుడ పక్షి నిలబడి.. దేవతామూర్తిని అర్చించింది. దీనిని దేవుడి మహిమగా పేర్కోన్న భక్తులు.. గరుడ పక్షిని కూడా మహిమాన్వితమైనదిగా భావించారు. శ్రీవారికి గరుడ పక్షికి వున్న అనుబంధాన్ని మరోమారు ఈ ఘటన చాటిందని భక్తులు పేర్కోన్నారు.

కాగా తాజాగా.. నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, కేసుపల్లి శివాలయంలో పిచుకను పోలిన వింతపక్షి ఒకటి, శివలింగం ముందు తిరుగుతూ, అక్కడి నుంచి కదలకపోవడం కెమెరాలకు చిక్కింది. ఈ పక్షి కూడా కోరుట్లలో కనిపించిన గరుడపక్షిని పోలినట్టుగానే ఉండటం గమనార్హం. మిర్యాలగూడ సమీపంలోని ఓ ఆలయం గర్భగుడిలోకి కూడా ఓ పక్షి వెళ్లగా, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. ఇవి మహాత్మ్యం గల పక్షులని నమ్ముతున్న భక్తులు, వాటికి కూడా పూజలు చేయడం ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles