India's changing relationship with Pakistan ప్రేమ కోసమై జైలులో.. ఆరేళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు

Hamid nehal ansari meets sushma swaraj says meri madam mahaan

Wagah-Attari border,Sushma Swaraj,Peshawar Central jail,Peshawar,Pakistan,hamid nihal ansari,Hamid Ansari meets Sushma Swaraj, politics

Indian national Hamid Nehal Ansari returned home after being jailed in Pakistan for the past 6 years. He had reportedly tried to enter Pakistan to meet a woman whom he had fallen for after meeting her online.

ప్రేమ కోసమై జైలు గోడల మధ్య ప్రియుడు.. మానసిక వేదన..

Posted: 12/20/2018 01:41 PM IST
Hamid nehal ansari meets sushma swaraj says meri madam mahaan

ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అనే పాతాళభైరవి సినిమాలోని పాట తెలియని వారుండరు.. అయితే ప్రేమ కోసమై దేశ సరిహద్దులు దాటనే పాపం పసివాడు అంటూ పాడాల్సిన అవసరం వచ్చింది ఆ తల్లిదండ్రులకు. అదెలా అంటారా.. మన దాయాధి దేశం పాకిస్తాన్ లోని ఓ యువతిని అన్ లైన్ ద్వారా ప్రేమించి.. అమె పెళ్లి ఇతరులతో జరిగిపోతుందని భావించిన దేశ అర్థిక రాజధాని ముంబైకి చెందిన యువకుడు అమె కోసం చేయకూడని సాహసాలే చేసి చివరకు పోలీసులకు చిక్కి.. కన్నవాళ్లకు, ఉన్న ఊరుకు దూరంగా.. దేశం కానీ దేశంలో జైలు శిక్ష అనుభవించాడు.

వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన హమీద్ నెహాల్ అన్సారీ అనే సాప్ట్ వేర్ ఇంజనీరుకు ఫేస్ బుక్ లో పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే అది క్రమంగా ప్రేమగా మారింది. దీంతో అమె తనకు తన తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని అవేదన చెందింది. తనను వచ్చి తీసుకెళ్లాలని కోరింది. దీంతో పాకిస్థాన్ కు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అన్సారీ ప్రయత్నం విఫలమైంది. ఏం చేయాలో తెలియక.. అదే పేస్ బుక్ ద్వారా పరిచయం అయిన మరో స్నేహితుడిని సలహా కోరాడు.

అతడిచ్చిన సూచనల మేరకు నేరుగా అప్ఘనిస్తాన్ కు వెళ్లి.. అక్కడ నుంచి ఆ దేశం సరిహద్దు దాటి.. పాకిస్తాన్ లోకి కోహార్ కు చేరకున్నాడు. తనకు సాయం చేస్తానని చెప్పిన స్నేహితుడిని కలిశాడు. పోలీసులు పట్టుకోకుండా అతడి నుంచి పాకిస్తాన్ నకిలీ గుర్తింపు కార్డును పొందాడు. అప్పటి నుంచి తన ప్రేయసి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. భారత గూఢాచారని భావించి పోలీసులు అన్సారీని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కు అప్పగించారు. తీరా పాక్ ఆర్మీ అతడ్ని మానసికంగా హింసించింది.

అయితే విషయం తెలుసుకున్న పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు.. మానవహక్కుల సంఘాలు అన్సారీ విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీంతో అతన్ని విచారించిన న్యాయస్థానంలో అన్సారీ తన ప్రేమను వెతుక్కుంటూ పాకిస్తాన్ కు వచ్చాడని పలు వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాయి. దీంతో ఏకంగా రెండున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం అన్సారీపై గూఢాచర్య అరోపణలు కాకుండా కేవలం నకిలీ గుర్తింపు కార్డు కలిగివున్నాడన్న అభియోగాలు నమోదయ్యాయి.

ఫలితంగా మిలటరీ కోర్టు ఆదేశాలతో పెషావర్‌లోని సెంట్రల్‌ జైలులో అన్సారీ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. అతని లీగల్‌ డాక్యుమెంట్లు సిద్ధం కాకపోవడంతో భారత్‌కు అన్సారీ తిరిగి రాలేక పోయాడు. బాధితుడి తరుపున పాకిస్తాన్ మానవహక్కుల సంఘాలకు చెందిన న్యాయవాదులు అన్సారీ తల్లి ఫౌజియా అన్సారీ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా అభ్యర్థించారు.

పాకిస్తాన్ లో మారిన ప్రభుత్వ పాలనకు గీటురాయిలా నిలుస్తూ.. అన్సారీని విడుదల చేసింది అక్కడి ఇమ్రాన్ ఖాన్ ఫ్రభుత్వం. ఈ విడుదల ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్దరించేలా వుందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తన కొడుకు విడుదలపై అతని తల్లి ఫౌజియా అన్సారీ మాట్లాడుతూ అతని విడుదల మానవత్వానికి లభించిన విజయంగా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wagah-Attari border  Sushma Swaraj  Peshawar  Pakistan  hamid nihal ansari  politics  

Other Articles