Jaya: 8 Crore Hospital Bill for 75 Days? ‘అమ్మ’ అసుపత్రి బిల్లు.. చూస్తే గుండె గుబేలు

Apollo hospital charges rs 1 17 cr for food during j jayalalitha s stay

J Jayalalitha, Tamil Nadu, Apollo Hospital, Justice Arumughasamy Commission, AIADMK, C Vijaya Baskar, C Ponnaiyan, tamil nadu, politics

Two years after the death of former Tamil Nadu Chief Minister J Jayalalitha, Apollo Hospital submitted the bill for her 75-day hospitalisation to Justice Arumughasamy Commission

‘అమ్మ’ అసుపత్రి బిల్లు.. చూస్తే గుండె గుబేలు

Posted: 12/19/2018 08:02 PM IST
Apollo hospital charges rs 1 17 cr for food during j jayalalitha s stay

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సుమారు రెండేళ్ల తరువాత అమె చికిత్స పోందిన అస్పత్రి బిల్లు బయటకు లీకైంది. ఇప్పటికే అమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పుడు అపోలో అసుపత్రిలో అమె చికిత్సకు ఖర్చు చేసిన మొత్తం వివరాలు, అపోలో అసుపత్రి వసూలు చేసిన బిల్లు వివరాలు మరో వివాదం తెరమీదకు వచ్చింది.

జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన 75 రోజుల బిల్లు సుమారు ఏడు కోట్లు రూపాయల బిల్లును వసూలు చేయగా.. అందులో ఓ పేషంట్ గా చికిత్స పోందుతున్న అమె.. కేవలం తిండి ఖర్చుల కింద రూ.1.17 కోట్లు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆరుముఖ స్వామి కమిషన్‌కు అపోలో ఆస్పత్రి సమర్పించిన రసీదు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

జయలలిత చికిత్స కోసం అపోలో ఆస్పత్రి మొత్తం రూ.6.85 కోట్లు వసూలు చేయగా...ఇందులో రూ.6 కోట్ల రూపాయలను అన్నాడీఎంకే పార్టీ ఖాతా నుంచి చెక్ రూపంలో అందజేశారు. ఇందులో లండన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలేకు రూ.92.07 లక్షల ఫీజు చెల్లించారు. సింగపూర్ నుంచి జయలలితకు ఫిజియోథెరపీ చికిత్స అందించిన మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి ఫీజు కింద రూ.1.29 కోట్లు చెల్లించారు. అపోలో ఆస్పత్రికి ఇంకా రూ.44.56 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles