dacoits throw woman from running train in AP కొండవీడు ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడి దొంగల బీభత్సం..

Dacoits merciless act throw pregnant woman from running kondaveedu express

dacoity in train, daciots in kondaveedu express, thieves attack, pregnant woman, divya, bengaluru, kondaveedu express, Anantapur district, Andhra Pradesh, Crime

dacoits who entered into kondaveedu express at anantapur district of andhra pradesh had done a merciless act. they threw away pregnant woman divya from running train, who objected to give her gold ornaments.

దారుణం: కదులుతున్న రైలు నుంచి గర్భిణి తోసేసిన దోపిడి దొంగలు

Posted: 12/18/2018 03:01 PM IST
Dacoits merciless act throw pregnant woman from running kondaveedu express

రైలు ప్రయాణాలు సురక్షితం చేసేందుకు ఆర్ఫీఎఫ్ పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నా.. అంధ్రప్రదేశ్ లో రైలు దొంగతనాలు శృతిమించిపోతున్నాయి. ఆ మధ్య ఓ మహిళా ఐపీఎస్ అధికారినే టార్గెట్ చేసిన దొంగలు.. అడపాదడపా ఏపీలోని రైళ్లలో తమ ఉనికి చాటుకుంటున్నారు. తాము మనుషులమే అన్న కనీసం ఇంకితాన్ని మరిచి దారుణంగా వ్యవహరించారు. తాజాగా ఎక్స్ ప్రెస్ రైలులోకి చోరబడిన దోపిడీ దొంగలు రైలు ప్రయాణికులతో అమానుషంగా ప్రవర్తించారు. ఓ గర్భిణి వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్న దుండగులు, గర్భిణీ అన్న కనీస కనికరం కూడా లేకుండా కదులుతున్న రైలు నుంచి ఆమెను నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశారు.

దీంతో తీవ్రంగా గాయపడి సృహకోల్పోయిన బాధితురాలిని స్థానికులు గమనించి 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దివ్య బెంగళూరులో తన భర్త వద్దకు వెళ్లేందుకు నిన్న మచిలీపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లే కొండవీడు ఎక్స్ ప్రెస్ ను ఎక్కారు. రైలులో దివ్య కింది బెర్తులో పడుకోగా, పక్కనే ఉన్న మరో బెర్తులో ఆమె అత్త పడుకున్నారు.

అయితే రాత్రిపూట రైల్లోకి ఎక్కిన దోపిడీ దొంగలు మహిళలు, పురుషులను బెదిరించి నగలు, నగదు లాగేసుకున్నారు. పలువురిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న దివ్య వద్ద నగలు, మొబైల్ ఫోన్, నగదును లాగేందుకు ప్రయత్నించారు. అమె ప్రతిఘటించడంతో దోపిడీ దొంగలు ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశారు. ఆ తరువాత వారు కూడా బయటకు దూకేసి అమె మెడలోని బంగారు అభరణాలను దోచుకెళ్లారు.

తీవ్రగాయాలపాలైన బాధితురాలు దివ్య సృహకోల్పోయి పడివుంది. ఉదయం పోలాలకు వెళ్లే స్థానికులు అమెను గమనించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దివ్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. దివ్య వాంగ్మూలం ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామనీ, త్వరలోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dacoits  kondaveedu express  divya  golden ornaments  anantapur  crime  

Other Articles