తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయని నేతలు ఇప్పుడు చర్చనీయాంగా మారారు. ఇక నెట్ జనులైతే వీరిని సోషల్ మీడియా వేదికగా ఎన్నో విధాలుగా అడుకుంటున్నారు. ఇంతకీ వారెవరూ అంటారా..? వారిలో ఒకరు విజయావాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే.. మరోకరు సినీనిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్. ఫలితాలు వెలువుడతున్న క్రమంలో తెలంగాణలో కారు దూసుకెళ్తుండగా వీరు మాత్రం మీడియాకు దూరంగా వున్నారు.
దీంతో వీరని టార్గెట్ చేసిన నెట్ జనులు వారిపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ఈ ఇద్దరు నేతలను ఆడుకుంటున్నారు. ఎందుకంటారా.? మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ మీడియా కోడై కూస్తే.. లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజా కూటమిదే అధికార పీటం అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవంగా చెప్పాలంటే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. అయితే ఫలితాలు మాత్రం లగపాటి సర్వేకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
ఎన్నికల ఫలితాలకు ఆయన సర్వేకు ఎక్కడా పోంతన లేకపోవడంతో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ సుమారు 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుకుంది. అయితే విశ్వసనీయత వుండే రాజగోపాల్ సర్వే తారుమారు కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఆకు.. ఆకు తింటావా’ అంటూ ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు. లగపాటి రాజగోపాల్ ప్రజలను మోసం చేశారని, తొలిసారి ఆయన కచ్చితత్వాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు. ‘సర్వే జన లగడ సుఖినో దుఖినో భవంతు’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక అటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీనిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై నెట్ జనులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఆయన చెప్పడం.. ఫలితాల రోజున సాయంత్రం ఏడు గంటలకు మీడియా మిత్రులు సెవన్ ఓ క్లాక్ బ్లేడు తీసుకురావాలని కోరారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేశ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ‘ ఆ బండ్ల గణేశ్ ఎక్కడా?.. నీ కోరిక మేరకే సెవన్ ఓ క్లాక్ బ్లేడు తీసుకున్నాం.. ఇంతకీ నీవెక్కడా.? అంటూ కొందరూ కామెంట్లు పెట్టగా, ‘కత్తులు సిద్ధంగా ఉన్నాయ్.. గొంతు కోసుకోవడానికి సిద్ధమా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు. జోకులతో మెమెలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా బండ్లను ఇంటర్వ్యూ చేసిన ఓ చానెల్ జర్నలిస్ట్.. స్వీట్ బాక్స్‌తో పాటు బ్లేడ్‌లతో ఆయన ఇంటికి వెళ్లగా, ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు బండ్ల గణేశ్ నిరాకరించారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more