Uttamkumar Reddy alleges tampering of EVM machines ఈవీఎంపై అనుమానాలు.. వీవీపాట్ లతో లెక్కించాలి: ఉత్తమ్

Telangana elections 2018 uttamkumar reddy alleges tampering of evm machines

telangana elections results, Tpcc president, Uttam Kumar Reddy, EVM tampering, VVPAT machines, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: Telangana PCC President Uttam Kumar Reddy alleges tampering of EVM machines, demands election commission for tallying of VVpat prints counting.

ITEMVIDEOS: ఈవీఎంపై అనుమానాలు.. వీవీపాట్ లతో లెక్కించాలి: ఉత్తమ్

Posted: 12/11/2018 04:27 PM IST
Telangana elections 2018 uttamkumar reddy alleges tampering of evm machines

తెలంగాణ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల కమీషన్ తమ అభ్యర్థులు వ్యక్తం చేసిన అనుమానాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. వీవీప్యాట్ లెక్కింపులు జరపలేమని చెప్పడం అనేక సందేహాలకు తావిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అందువల్లే అధికార టీఆర్ఎస్ భారీగా స్థానాలను గెలుచుకోగలిగిందని విమర్శించారు. నిజాలను నిగ్గు తేల్చడానికి ఆయా నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను పరిశీలించాలని డిమాండ్ చేశారు.

అధికారంలో వున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత వుంటుందని.. పెరిగిన ఓట్ల శాతం స్పష్టం చేస్తున్నా.. అందుకు భిన్నంగా మళ్లీ అదే పార్టీ అధికారంలోకి రావడం కూడా సందేహాలను బలోపేతం చేస్తుందని అన్నారు. ఓటమి ఎరుగని కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిన అధికార పక్షం ఎన్నికల సంఘంతో కలసి ట్యాపరింగ్ చేసి ఆయా స్థానాల్లోని నేతలను ఓడించారన్న విమర్శలు వస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఇప్పటికే ఈ విషయమై తమ పార్టీ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను 100 శాతం లెక్కించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఈసీకి సమర్పించామని కూడా ఆయన చెప్పారు. ఎవరెవరూ ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నాయకులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు.  ఫలితాలను ముందే ఎలా చెప్పగలిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ టాంపరింగ్‌ను బలపరుస్తున్నాయన్నారు.

వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కింపు కూడా తప్పక జరపాలన్నారు. ఈ విషయంలో ప్రజా కూటమి అభ్యర్థులు రిటర్న్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వీవీప్యాట్‌ లెక్కింపు జరిపే వరకు పట్టుపట్టాలని సూచించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాకూటమిగా జతకట్టినా.. ఫలితాలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles