Harish Rao sets record with over 1 lakh votes majority తెలంగాణలో ఎన్నికలలో హరీష్ రావు రికార్డు విజయం

Telangana elections 2018 harish rao sets record with over 1 lakh votes majority

telangana elections results, Harish Rao, one lakh votes majority, siddipet, opposition leaders, deposits, KTR, Tweet, Kavitha, Blade babu, Gaddam babu, bandla ganesh, uttamkumar reddy, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: Telangana minister, Harish Rao has set a record of sorts by winning with over one lakh majority votes. It is easily the highest ever majority in both the Telugu states, where the rivals have lost their deposits for the fifth time in a row.

ITEMVIDEOS: సిద్దపేటలో హరీష్ రావు రికార్డు విజయం

Posted: 12/11/2018 01:39 PM IST
Telangana elections 2018 harish rao sets record with over 1 lakh votes majority

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఆది నుంచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న అధినేత కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 14ఏళ్ల కాలంలో ఆరు పర్యాయాలు ఎన్నికలకు వెళ్లిన ఆయన తన ప్రత్యర్థులపై అప్రతిహాత విజయాన్ని అందుకున్నారు. సిద్దిపేట తనదే అన్న సంకేతాలను మరోమారు ఆయన తన విజయంతో ప్రత్యర్థులకు తెలిపారు. ప్రత్యర్థులకు గత ఐదు పర్యాయాలుగా డిపాజిల్లు కూడా రాకుండా చేసిన ఘనత సాధించారు.

సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీశ్ రావు దాదాపుగా 1,20,650 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. తద్వారా గతంలో మరెవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ స్థానం నుంచి బరిలో దిగిన హరీష్ గెలుపువై ఏమాత్రం అనుమానాలు వ్యక్తం చేయని పార్టీ శ్రేణులు.. ఆయన సాధించే మెజారిటీని పైనే వారు కన్నేశారు. అయితే ఈ సారి లక్ష మెజారిటీ సాధిస్తానని హరీష్ ముందుగానే చెప్పారు. అయితే అనుకున్నదే జరిగిందని హరీష్ రావు సాధించిన మెజారిటీ స్పష్టం చేసింది.

1998లో ఉమ్మడి ఏపీలో గొట్టిపాటి నర్సయ్య 1.04 లక్షల మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏఐఎంఐఎం అభ్యర్థి 2004లో చార్మినార్ నుంచి 1.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది కొత్త రికార్డును నెలకొల్పారు. తాజా విజయంతో హరీశ్ రావు ఆ రికార్డులు అన్నింటిని తిరగరాశారు. కాగా, హరీశ్ రావు గెలుపుతో సిద్ధిపేటలో టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాయి. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం స్వీట్లు తినిపించుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles