KTR tweets gun shot pic, kavitha spares oppostion leaders తెలంగాణలో గురితప్పలేదన్న కేటీఆర్.. క్షమించి వదిలేస్తామన్న కవిత

Telangana elections 2018 ktr tweets gun shot pic kavitha spares oppostion leaders

telangana elections results, KTR, Tweet, Kavitha, Blade babu, Gaddam babu, bandla ganesh, uttamkumar reddy, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: After a full swing goes towards ruling party TRS, KTR tweets a pic in which he is psoing with gun, while kavitha says TRS will forgive and spare blade babus and gaddam babus.

తెలంగాణలో గురితప్పలేదన్న కేటీఆర్.. క్షమించి వదిలేస్తామన్న కవిత

Posted: 12/11/2018 12:53 PM IST
Telangana elections 2018 ktr tweets gun shot pic kavitha spares oppostion leaders

తెలంగాణలో ఓటరు తీర్పు ఎలా వుంటుందన్న ఉత్కంట ఇవాళ ఉదయం వరకు అన్ని పార్టీల నేతలను, అభ్యర్థులను కలవరపెట్టాయి. కాగా, ఇవాళ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో అది నుంచి ఫలితాలు మాత్రం ఏకపక్షంగా అధికార టీఆర్ఎస్ పక్షాన సాగాయి. దీంతో మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ పేజీలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి.

‘కేటీఆర్‌..గురిచూసి కొడుతున్నారు..విజయం ఆయనదే..’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు. కేటీఆర్‌ పోస్ట్‌ చేసిన ఈ కొత్త ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ స్పందించారు. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌.. ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్‌ ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోపై డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కూడా కామెంట్‌ చేశారు. ‘ఈ ఫొటో కాన్ఫిడెన్స్‌ కు కొత్త అర్థం చెబుతోంది. ఫలితాల క్రమంలో కేటీఆర్‌ కొత్త ఫొటోను పెట్టారు’ అని ట్వీట్‌ చేశారు.

ఇదిలా వుండగా, ఎన్నికల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు హద్దుమీరి మరీ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారని మీడియా ప్రశ్నపై నిజామాబాద్ ఎంపీ కవిత చాలా హుందాగా స్పందించారు. ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని పేర్కోన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్బాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పుకే ఎక్కవు విలువ వుంటుందని, వారే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలను శిక్షించారని.. అంతటి భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నవారిని తాము క్షమించి వదిలేస్తామని చెప్పారు. అయితే ప్రజాబీష్టం వెలువడిన తరువాత ఏం చేసుకున్నా వారి ఇష్టమని.. ఇక గడ్డాలు పెంచుకుంటారా.. సన్యాసం తీసుకుంటారా అన్నది వారిష్టానికే వదిలేస్తున్నామని చెప్పారు. ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles