bettings on hot seats and results in telangana తెలంగాణ ఎన్నికల అంశం.. పందెంరాయుళ్ల పాలిట వరం..

Telangana elections bettings on hot seats and results

Telangana Polls, bettiings, majority betting, hot seats betting, results betting, telangana elections 2018, telangana elections, Rajath Kumar, kusuma kumar, MahaKutami, Congress, TRS, Election officials, Telangana Politics

Telangana Assembly Elections 2018: Bettings on hot seats, majority and results crosses crores in the state.

తెలంగాణ ఎన్నికల అంశం.. పందెంరాయుళ్ల పాలిట వరం..

Posted: 12/08/2018 08:08 PM IST
Telangana elections bettings on hot seats and results

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టీ ఫలితాలమీదే కేంద్రీకృతమైంది. కానీ, బెట్టింగ్ రాజాలు మాత్రం గెలుపోటములపై పందాలు కాస్తూ.. క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తరహాలో.. ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై కోట్లకు కోట్లు పందెం కాస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిస్థానాల్లోనూ పందేల రాయుళ్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని హాట్ హాట్ అసెంబ్లీ సీట్లపై ఈ బెట్టింగ్ బంగార్రాజులు.. ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా గజ్వెల్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపుపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గెలుస్తారా? లేక విజయం ఒంటేరు ప్రతాప్ రెడ్డిని వరిస్తుందా? అనే విషయంలో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నట్టుగా సమాచారం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపుపైనా బెట్టింగ్ బంగార్రాజులు కన్నేసినా.. అక్కడ మాత్రం గెలుపోటములపై కాకుండా కేవలం మెజారిటీపై బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎంత మెజారిటీ వస్తుందనే  అంశంలో భారీగానే బెట్టింగు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రజాకూటమి నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా బెట్టింగ్ రాజాలు బంగారుబాతుగా భావిస్తున్నారు. అక్కడ గెలుపోటములు ఎవరివనే అంశంపై కోట్ల రూపాయలు పందెం కాసినా.. అత్యధికంగా రేవంత్ గతం కంటే అధిక మెజారిటీ సాధిస్తారా.? లేక ఎంత మెజారిటీ సాధిస్తారు అన్న అంశంపైనే బెట్టింగ్ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ తలెత్తిన ఉద్రిక్తపరిస్థితులు, టీఆర్ఎస్ ముఖ్యులు అధికంగా మోహరించి గెలుపుకోసం కృషి చేయడం లాంటి అంశాలు.. కొడంగల్‌కు అధిక ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి.

ఇక బెట్టింగ్ బంగ్రారాజులకు కీలకంగా మారిన స్థానం కూకట్ పల్లి నియోజకవర్గం. నందమూరి నవతరం రాజకీయ వారసురాలిగా నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని రాజకీయ అరంగ్రేటం చేసి.. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో ఈ స్థానం కూడా పందెంరాయుళ్లు బంగారు బాతు గుడ్డుగా మారిందనే చెప్పారు. నందమూరి సుహాసిని గెలుస్తుందా.? లేదా.? అన్న అంశంపై భారీగా బెట్టింగ్ కాసినట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో గెలుపోటములపై బెట్టింగ్ కోసం భారీగానే సొమ్మును వెచ్చించినట్టు సమాచారం.

మొదట్లో తెలంగాణలో అధికారం ప్రజాకూటమిదా? టీఆర్ఎస్‌దా? అనే అంశంపైనే ‌ద‌ృష్టిపెట్టిన బెట్టింగ్ గ్యాంగులు.. అనంతరం ముఖ్యమైన నియోజకవర్గాలపై కన్నేశాయి. అందులో భాగంగానే గజ్వెల్, సిరిసిల్ల, కొడంగల్, కూకట్‌పల్లి సీట్లపై భారీగా బెట్టింగులు కాశాయి. అంతేకాదు, వార్ వన్‌సైడ్‌గా సాగే సిద్ధిపేట లాంటి నియోజకవర్గాల్లో మెజారిటీ ఎంతొస్తుందనే దానిపైనా బెట్టింగులకు దిగుతున్నారు పందేలరాయుళ్లు. మొదట్లో బెట్టింగులు మందకొడిగా సాగినా.. లగడపాటి సర్వే.. తరువాత బెట్టింగ్ బంగార్రాజుల్లో ఆశలు పెంచింది. దీంతో మరోసారి బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ బెట్టింగుల జోరు ఎవరిని ముంచుతుందో? ఎవరిని గట్టెక్కిస్తుందో మరో 48 గంటల తరువాత తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles