Telangana elections: Campaign of abuses ends ప్రచారం బంద్.. అంతా ష్.. గప్ చుప్.. పనులే..

Telangana elections campaign of abuses ends

KCR, TRS, Rahul Gandhi, chandrababu, kodandaram, Congress, Mahakutami, election commission, telangana elections 2018, Telangana Electtions, praja kutami, telangana assembly elections, telangana politics

Campaign for the assembly elections 2018 in Telangana and Rajasthan came to an end at 5pm on Wednesday.

ప్రచారం బంద్.. అంతా ష్.. గప్ చుప్.. పనులే..

Posted: 12/05/2018 06:18 PM IST
Telangana elections campaign of abuses ends

రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ ఐదు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం బంద్ అయింది. దాదాపు నెలరోజులుగా అన్ని నియోజకవర్గాల్లో హోరెత్తించిన మైకులు సైలెంట్ అయ్యాయి. అంతటా వైన్ షాపులు బంద్ అయ్యాయి. అన్ని పోలింగ్ కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించుకున్నాయి. దీంతో మరో 38 గంటల వ్యవధిలో ప్రారంభం కానున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 7వ తేదీ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాధారణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో రాష్ట్రమంతటా మొత్తం 18వందల 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇదిలావుండగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఇన్నాళ్లు ఓటర్లను తమదైన ప్రచారంతో, ప్రసంగాలతో అకట్టుకున్న పార్టీలు.. ఇకపై అభ్యర్థులు, వారి అనుఛరగణం చాకచక్యంతో ఓటర్లను తమ వైపు అకర్షించుకునేందుకు ప్రయత్నాలను చేస్తుంది. అంటే మందు, బిర్యానీలతో కొందరిని అకుట్టుకుంటే.. మరికొందరిని మాత్రం మనీ మాటున బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలకు తెరలేస్తుంది. తమ చేతిలో వున్న 38 గంటల సమయాన్ని పూర్తిగా బేరసారాల సమయంగా మార్చుకుంటాయి పార్టీలు.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో ఈ పార్టీ...ఆ పార్టీ అని లేకుండా అందరి మధ్య పోటాపోటీ నెలకొంటోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఎన్నికల సంఘం...మద్యం, నగదు పంపిణీని కట్టడి చేయడంపై దృష్టిసారించారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముమ్మర వాహనాలను తనిఖీలు చూస్తున్నారు.

ఇదిలావుండగా, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలున్న నియోజకవర్గాలైన సిర్పూర్ , చెన్నూర్,  బెల్లంపల్లి,  మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,  ఇల్లెందు, కొత్తగూడెం , అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ముందే మైకులు బంద్ అయ్యాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేశారు పార్టీల నాయకులు.

గతంలో 68.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 32 వేల 815 పోలింగ్ కేంద్రాలను పెట్టారు. 1లక్ష 60వేల 500 మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. 279 ప్లటూన్ల కేంద్రబలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీసులు 30వేల మంది.. ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాలనుంచి వచ్చిన పోలీసులతో మొత్తం 60 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TRS  Rahul Gandhi  chandrababu  kodandaram  Congress  Mahakutami  telangana politics  

Other Articles