Hyderabad High Court objects Revanth Reddy arrest రేవంత్ అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం.. విడుదలకు ఈసీ ఆదేశం

What s wrong in revanth reddy s bandh call high court

High court, Telangana ECO, Rajath kumar, revanth reddy, Telangana government, Telangana Intelligence, police,, revanth reddy, P Narender Reddy, kcr, geetha, kondal reddy, TRS, Congress, Telangana PCC, Telangana PCC working President arrested, KCR rally, Telangana assembly elections, Telangana elections 2018, telangana politics

High Court takes strong objection over the arrest of Telangana Congress Working President Revanth Reddy. The court asked the police to explain on what basis he was arrested and what is wrong in his bandh call.

రేవంత్ అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం.. విడుదలకు ఈసీ ఆదేశం

Posted: 12/04/2018 04:24 PM IST
What s wrong in revanth reddy s bandh call high court

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో మండిపడింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు ఈడ్చుకుని వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణించిన న్యాయస్థానం అసలు రేవంత్ రెడ్డిని ఏ సాక్ష్యాధారాలతో అరెస్టు చేశారని ప్రశ్నించింది. కాగా, ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పకుండా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేశారని రేవంత్ తరపు న్యాయవాది తన పిటీషన్ లో పెర్కోన్నారు.

ఈ సందర్భంగా కోర్టు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి ఓ పార్టీ నేతను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారో చెప్పాలని న్యాయస్థానం కోరింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. రేవంత్ కారణంగా కొడంగల్ లో అల్లర్లు తలెత్తే అవకాశం ఉందని తమకు ఇంటెలిజన్స్ వర్గాల నుంచి నివేదిక అందిందని తెలిపారు. కొడంగల్ లోని కోస్గీలో ఈ రోజు జరిగే ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉంచారో తెలపాలని ఆదేశించింది. అలాగే అల్లర్లపై ఇంటెలిజెన్స్ అందించిన నివేదికను తమముందు ఉంచాలని సూచించింది. అనంతరం విచారణను ఈరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది. కొడంగల్ లోని కోస్గీలో ఈరోజు సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో అధికారులు ఆయన్ను ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దీంతో రేవంత్ భార్య గీతతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.. శాంతిభద్రతల సమస్య రావొచ్చన్న ఉద్దేశంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరెస్టుపై హైకోర్టులో ప్రత్యేక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని రజత్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పోలీసులు కోర్టుకు విన్నవించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles