Govt Mulls QR-Based 'Offline Aadhaar' ఆధార్ క్యూఆర్ కోడ్ తో కేవైసీ..అర్బీఐతో బ్యాంకుల చర్చలు..

Govt rbi mulls for qr code based offline aadhaar

Section 57 of the Aadhaar Act, offiline aadhaar, biometric e-KYC model, customer verification, Reserve Bank of India, QR codes based aadhaar, UIDAI, e-Aadhaar, offline verification, Aadhaar authentication, Aadhaar KYC, SC order on Aadhaar

Back in April, the Unique Identification Authority of India (UIDAI) had introduced secure digitally-signed QR Code on e-Aadhaar to facilitate better offline verification of an individual.

ఆధార్ క్యూఆర్ కోడ్ తో కేవైసీ..అర్బీఐతో బ్యాంకుల చర్చలు..

Posted: 12/04/2018 05:13 PM IST
Govt rbi mulls for qr code based offline aadhaar

ఆధార్.. ప్రతి భారత పౌరునికి వ్యక్తిగత గుర్తింపునిస్తుంది. సామాన్యుడి హక్కుగా తొలుత ప్రచారం జరిగిన ఈ కార్డు.. మన దేశంలో అన్నింటికీ అదే ప్రధాన ఆదారంగా మారింది. అయితే ఆధార్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధార్ వ్యక్తిగత గుర్తింపు అని చెప్పిన న్యాయస్థానం.. దానిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టరాదని ప్రభుత్వాలను అదేశించింది.

వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన సమాచారం గోప్యంగా వుంచాలని దేశఅత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించేవరకు.. మొబైల్ సిమ్ కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా ఆధార్ తప్పని సరిగా మారింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రజాసంక్షేమ పథకాలు పొందాలంటే మాత్రం ఆధార్ తప్పనిసరి అని కూడా న్యాయస్థానం వెలువరించింది. అయితే ప్రభుత్వాధికారుల నుంచి కూడా ఈ సమాచారం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం సూచించింది.

దీంతో ఆధార్ మీద ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఏర్పడ్డాయి. ఆధార్ భద్రతపై భయాలు ఉన్నాయి. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఈజీగా బయట లభ్యం అవుతున్న క్రమంలో తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరుగవచ్చని కూడా అందోళన వ్యక్తమవుతోంది. 500 రూపాయలకే ఆధార్ వివరాలు అమ్మేస్తున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆధార్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దని, అన్నింటికి(టెలికాం కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లకు) ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

దీంతో ఇప్పటికే అనేక కోట్ల మంది అధార్ డేటాను పోందిన టెలికాం సంస్థలు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆర్బీఐ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆధార్ స్థానంలో ఆఫ్ లైన్ ఆధార్(క్యూఆర్ కోడ్) తీసుకురావాలని, ప్రూఫ్‌గా వాటిని అనుమతించాలని యోచిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ క్విన్ రెస్పాన్స్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ల ద్వారా అనుసంధానం చేసుకునే విధంగా బ్యాంకులు, టెలికాం సంస్థలు అర్బీఐకి సూచిస్తున్నాయి.

ఈ బ్యాంకు అకౌంట్లు, పేమెంట్ వ్యాలెట్లు, బీమా పథకాలకు.. ఆధార్ ఈ-కేవైసీ బదులు ఆఫ్‌లైన్ ఆధార్ వినియోగించాలని చూస్తున్నారు. క్యూఆర్ కోడ్ అంటే డిజిటల్ సంతకం అన్నమాట. ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ సంస్థ పేరు మీద ఈ సంతకం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లను సెర్వర్లకు లింక్ చేసి ఉంచరు. దీంతో వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండదని రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ ఆధార్ తీసుకొచ్చే విషయమై యూఐడీఏఐ అధికారులతో రిజర్వ్ బ్యాంకు అధికారులు చర్చలు జరుపుతున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank accounts  government  reserve bank of India  QR code  offline Aadhaar  

Other Articles