Oil prices soar after US, China suspend trade hostilities పెట్రో బాంబు: మళ్లీ పెరగనున్న ఇంధన ధరలు..

Oil prices jump 5 percent on u s china trade war ceasefire

Oil prices, china, United States, 90-day truce, trade war, OPEC, Qatar U.S. West Texas Intermediate, U.S. crude prices, Canada, oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, petrol price, diesel price

Oil prices soared by around 5 percent on Monday after the United States and China agreed to a 90-day truce in their trade war, and ahead of a meeting this week by producer club OPEC that is expected to result in a supply cut.

పెట్రో బాంబు: మళ్లీ పెరగనున్న ఇంధన ధరలు..

Posted: 12/03/2018 12:28 PM IST
Oil prices jump 5 percent on u s china trade war ceasefire

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఎగబాకే అవకాశం వుంది. ఏకంగా రికార్డు స్థాయి ధరలకు చేరిన ఇంధన ధరలు.. గత రెండు నెలలుగా క్రమంగా దిగివస్తుండగా, మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ తాత్కాలికంగా వాయిదాపడటంతో.. ఇంధన ధరలకు రెక్కలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు.. రానున్న 90 రోజుల పాటు తమ మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్దాన్ని వాయిదా వేసుకోవాలని అటు అమెరికా, ఇటు చైనాలు నిర్ణయించాయి.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ నిర్ణయం అలా తీసుకున్నారో లేదో ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు సుమారుగా ఐదు శాతం మేర పెరిగాయి. అమెరికా టెస్ట్ టెక్సాస్ ఇంటెర్మీడియట్ (డబ్ల్యూటీఐ)లో క్రూడాయిల్ ధర బ్యారల్‌పై 2.45 డాలర్లు పెరిగి 53.38 డాలర్లుగా నమోదయ్యింది. ఇటీవల యాభై డాలర్లకు చేరిన క్రూడ్ అయిల్ ధర.. తాజాగా 53 డాలర్లకు పైగా చేరింది. క్రితం ముగింపుతో పోల్చితే బ్యారల్ క్రూడాయిల్ 4.8 శాతం పుంజుకుంది.

అటు అంతర్జాతీయ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్‌పై 2.38 డాలర్లు పెరిగి 61.84 డాలర్లుగా ధర పలుకుతోంది. త్వరలో సమావేశం కానున్న ఒపెక్ దేశాల సమావేశంలో ఉత్పత్తిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న కథనాలు కూడా ఇంధన ధరలు పెరగడానికి కారణం అవుతోంది. అమెరికా-చైనాలు ట్రేడ్ వార్‌ను వాయిదావేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనానికి డిమాండ్ పెరగనుంది. ఇంధన అవసరాలకు ఎక్కువగా దిగుబడులపై ఆధారపడిన భారత్ సహా మిగిలిన దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముంది.

ఇదిలావుండగా, దేశీయంగా ఇవాళ పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 30 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.71.93 కి చేరింది. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.66.66 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 30 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.77.50 కి చేరగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.69.77 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి రూ.76.26 ఉండగా.. డీజిల్ ధర 39 పైసలు తగ్గి రూ.72.42 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 31 పైసలు తగ్గి రూ.75.70ఉండగా.. డీజిల్‌ ధర 38 పైసలు తగ్గి రూ.71.46 వద్ద కొనసాగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  dharmendra pradhan  petrol price  diesel price  

Other Articles