kodandaram-promises-free-power-up-to-100-units 100 యూనిట్ల విద్యుత్, 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ: కోదండరామ్

100 units power 6 gas cylinders 1 lakh to women groups kodandaram

praja front convenor, kodandaram, election promises, 100 units free power, 6 subsidy gas cylinders, 1 lakh grant to dwacra groups, Telangana, politics

praja kutami convenor professor kodandaram promises to telangana people at kodangal public meeting that if praja front comes to power, government will give 100 units power, 6 gas cylinders, 1 lakh grant to women self help groups.

100 యూనిట్ల విద్యుత్, 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, డ్వాక్రా సంఘాలకు లక్ష గ్రాంటు:కోదండరామ్

Posted: 11/28/2018 04:34 PM IST
100 units power 6 gas cylinders 1 lakh to women groups kodandaram

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో విద్యుత్ బిల్లులు స్లాబ్ పద్దతి పోయి టెలిస్కోపిక్ పద్దతిలోకి వచ్చాయిని.. గతంలో వంద యూనిట్ల వరకు వున్న స్తామ్ ఇప్పుడు 101 యూనిట్ల నేపథ్యంలో ప్రజలు వంద దాటిన స్లాబును మెత్తంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికలలో ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తే 100 యూనిట్ల లోపు విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని ప్రజాఫ్రంట్ కన్వీనర్ కోదండరాం వెల్లడించారు. కొడంగల్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధన కోసం పోరాడినట్లే.. రాష్ట్రం మేలు కోసం అంతా ప్రజా ఫ్రంట్‌గా ఏర్పడ్డామని తెలిపారు.

కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని, ప్రజల కడుపు నింపేందుకు కాదని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల చెవులో పూలు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణ అంటే కేవలం కుటుంబం కాదు, తెలంగాణ అంటే ప్రజలు.. దేనికోసమైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కలిసిగట్టుగా పోరాడి సాధించుకున్నామో.. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజా ఫ్రంట్‌ను గెలిపించండని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష రూపాయల గ్రాంటు ఇస్తామని అన్నారు.

ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తే.. రూ.2 లక్షల రుణమాఫీ లభిస్తుందని, తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయని తెలిపారు. 100 యూనిట్ల వరకు కరెంటు ఉచితమని, 200 యూనిట్ల వరకు ఒకే రేటు ఉంచుతామని తెలిపారు. దీనికి తోడు నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పారు. ఈ హామీలు అమలవుతాయా లేదా అనే అనుమానం వద్దని కోదండరాం అన్నారు. ఈ హామీలన్నీ అమలు చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని, ఈ విభాగాన్ని తామే పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రజా ఫ్రంట్‌ను గెలిపించి.. కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపాలని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : praja front  kodandaram  election promises  kodangal  Telangana  politics  

Other Articles