Bala sai baba passed away due to heart attack గుండెపోటుతో పరమపదించిన భగవాన్ శ్రీ బాల సాయిబాబా

Bhagavan sri bala sai baba passed away due to heart attack

Bala Sai Baba, Bala Sai Baba death, massive heart attack, disciples, Kurnool, Andhra Pradesh News, Hyderabad, andhra pradesh, politics, crime

Self-proclaimed Godman 'Bhagavan' Sri Bala Sai Baba of Kurnool passed away because of heart attack in a private hospital in Hyderabad on Tuesday. He was 59 years old. He was born on January 14, 1960.

గుండెపోటుతో పరమపదించిన భగవాన్ శ్రీ బాల సాయిబాబా

Posted: 11/27/2018 12:55 PM IST
Bhagavan sri bala sai baba passed away due to heart attack

స్వయం ప్రకటిత దైవాంష సంభూతుడిగా ప్రకటించుకున్న ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

బాల సాయిబాబా 1960 జనవరి 14న కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి రామనాథ శాస్త్రి కేరళ నుంచి కర్నూలుకు వలస వచ్చారు. బాల సాయిబాబాకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు. కడుపులో నుంచి శివలింగాన్ని తీసే విద్య ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే మధ్యలో కొంతకాలం బాల సాయిబాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు కర్నూలుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. శివరాత్రికి, సంక్రాంతికి బాల సాయిబాబా ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు.

బాల సాయిబాబా ఆధ్యాత్మికతతో ఎంతగా వార్తల్లో నిలిచారో.. అదేవిధంగా అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు. అదేవిధంగా ట్రస్ట్‌ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఆయన భౌతిక కాయాన్ని కర్నూలు తరలిస్తామని బాల సాయిబాబా అనుచరుడు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Sai Baba  Bala Sai Baba death  massive heart attack  disciples  Kurnool  Andhra Pradesh  

Other Articles