Tension arose in gajwel followed by police raid వంటేరు నివాసంలో పోలీసుల సోదాలు.. ఉద్రిక్తత

Tension arose in gajwel as police raided congress leader vanteru pratap reddy house

Vanteru Pratap Reddy arrested, police raid at Vanteru Pratap Reddy residence, telangana elections 2018, kcr, Harish Rao, petrol, police tried to set ablaze, police influenced by CM KCR, vanteru pratap reddy, Police raid, vanteru residence, Gajwel, hyderabad, Congress, praja kutami, Telangana politics

Tension arose in Gajwel constituency yesterday in the midnight as police raided praja kutami contestant and congress leader vanteru pratap reddy house.

గజ్వల్ లో ఉద్రిక్తత.. వంటేరు నివాసంలో పోలీసుల సోదాలు..

Posted: 11/27/2018 12:06 PM IST
Tension arose in gajwel as police raided congress leader vanteru pratap reddy house

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీకీ ప్రజాకూటమి పార్టీలకు మధ్య పోరు ఉదృతంగా సాగుతుంది. ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలివున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకరిపై మరోకరు విమర్శలు, అరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తాను ప్రాతినిధ్యం వహించే గజ్వల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటిమి పాలవుతారని అక్కత తమ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలుస్తారని మహాకూటమి ధీమా వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఇటీవల గజ్వల్ నియోజకవర్గం టీఆర్ఎస్ క్రీయాశీలక నాయకులను, కార్యకర్తలను తన ప్రగతి భవన్ కు పిలుచుకున్న కేసీఆర్.. అక్కడే వారికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవని, గెలవడం కాదు మెజారీటీపై దృష్టిసారించాలని కూడా దిశానిర్దేశం చేశారు. అయితే మహాకూటమి తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం తనదైనశైలిలో ప్రచారాన్ని వేడిక్కించారు. దీంతో గజ్వల్ నియోజకవర్గంలో గెలుపు ఎలా వుండబోతుంది. అక్కడి ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారన్న విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తుతుంది.

అయితే గజ్వల్ లో కేసీఆర్ తరపున పోలీసులు డబ్బు, మద్యం బాటిళ్లు పంచుతూ ఆయన తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి అరోపిస్తూ.. తన అరోపణలపై విచారణ జరపాలని ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా.. తనకు న్యాయం జరగలేదని అమరణ దీక్షకు కూడా కూర్చున్నాడు. అయితే ఒంటేరు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆయన నేరుగా ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేసి.. అక్కడే మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని వంటేరు ప్రతాప్‌ రెడ్డి మండిపడ్డారు. ఈసీతో భేటీ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ తన అనుచరులపై సివిల్‌ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో కోట్లాది డబ్బుల కట్టలు ఉన్నాయని, పోలీసులు అక్కడ ఎందుకు తనిఖీలు చేయడంలేదని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఎవరూ ప్రచారం చేయొద్దని, ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దామని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాల్ విసిరారు.

సోమవారం (నవంబర్ 26) రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేయడానికి పోలీసులు రావడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంటేరు కుంటుంబసభ్యులు, అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. వంటేరును అరెస్టు చేయడానికే పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు నిర్భందించడంతో.. కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి గత రాత్రి పోలీసులు సొదాల పేరుతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని ఆయన సంచలన అరోపణలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అయన అల్లుడు మంత్రి హరీష్ రావు అదేశాల మేరకు తన ఇంట్లో సోదాల పేరుతో వచ్చిన పోలీసులు తనపై పెట్రోల్ చల్లారని, తనకు నిప్పంటించే ప్రయత్నం చేయడం అదే సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో వారు వెనుకంజ వేశారని, పోలీసుల నుంచి తన కార్యకర్తలు అగ్గిపెట్టను కూడా లాక్కున్నారని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles