Jolt to TRS, Budan Baig to join TDP తుమ్మల దౌత్యం వికటించింది.. టీడీపీలోకి బుడాన్ బేగ్..

Tsidc chairman budan baig quits trs to join tdp

Budan Beg, Nama Nageshwara Rao, Tummala Nageshwar Rao, MP Konda Vishweshwar Reddy, TRS, Chevella, Telangana State Irrigation Development Corporation TSIDC, telangana assembly elections 2018, Budan Baig Shaik, TDP, Khammam, Telangana Politics

Just before the elections TRS seems to face another jolt with the reports doing rounds that Telangana State Irrigation Development Corporation (TSIDC) chairman Budan Baig Shaik is prepared to quit the party.

తుమ్మల దౌత్యం వికటించింది.. టీడీపీలోకి బుడాన్ బేగ్..

Posted: 11/26/2018 11:57 AM IST
Tsidc chairman budan baig quits trs to join tdp

అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించిన షాక్‌ తగిలింది. ఎన్నికలకు మరో పది రోజులు వుందన్న తరుణంలోనే తమ పార్టీ నేతలు వలసలు వెళ్లడం అధికార పార్టీని కలవర పెడుతుంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఆయన బాటలోనే అయన సన్నిహితుడు యాదవ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. ఇక తాజాగా బుడాన్ బేగ్ కూడా అధికార పార్టీకి షాక్ ఇవ్వడంతో.. షాకుల మీద షాకులు తగులుతున్న గులాబీ శ్రేణులకు అవి మింగుడుపడడంలేదు.

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు.. పార్టీ సీనియర్‌ నేత, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ (టీఎస్ఐడీసీ) బుడాన్‌ బేగ్‌ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న బేగ్‌ తాజా నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం రేపింది. పార్టీలో తన ప్రమేయం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్న పార్టీ.. తనను పట్టించుకోవడం లేదంటూ ఆయన పార్టీకి దూరంగా వుంటూవస్తున్నారు. టీఆర్‌ఎస్ పై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో మహాకూటమి నేతలు ఇదివరకే మంతనాలు జరిపినట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్‌ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్ గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. అయితే జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయనను పార్టీకి రాం రాం చేప్పనున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంతనాలు జరిపి.. పార్టీని వీడవద్దని బుజ్జగింపులు జరిపినా అది విఫలమైంది. బడాన్ బేగ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం జరిగిపోయింది. ఇక త్వరలో ఆయన టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ నెల 28న రాహుల్ గాంధీ, చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది.

బుడాన్ బేగ్ తో ఇప్పటికే మహాకూటమికి చెందిన టీడీపీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఖమ్మం  అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార పార్టీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ కుమార్, టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, జిల్లాతో పాటు ఖమ్మం పట్టణంలో బుడాన్ బేగ్ కు మంచి పట్టున్న నేత కావడం.. ఆయన టీఆర్‌ఎస్‌ రాజీనామా చేయడంతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.

నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు చక్రం తిప్పినట్టు తెలిసింది. కాగా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానం మాత్రమే అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇక బుడాన్‌ రాజీనామాతో తమ పార్టీ పరిస్థితి ఏంటని పలువురు పార్టీ శ్రేణులు కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Budan Beg  Nama Nageshwara Rao  Tummala Nageshwar Rao  Khammam  TRS  TDP  Telangana Politics  

Other Articles