Tuition teacher thrashes 7-year-old with shoes నెట్టింట్లో వైరల్: 7ఏళ్ల విద్యార్థిపై ట్యూటర్ దాడి..

Aligarh tutor caught on camera beating 7 year old with shoe

home tutor thrashes class 2 student, naurangabad home tutor, home tutor merciless act, Uttar Pradesh Tuition Teacher, Tuition Teacher, CCTV Footage, Assault, class two student thrashed with shoe, tuition teacher, 7 yr old student, naurangabad, beating minor, aligarh, CCTV, UP, Crime

In a shocking case of brutality, a seven-year-old boy was mercilessly thrashed by his home tuitor, in Naurangabad area of Aligarh. A video clip of this brutal act went viral on social media

ITEMVIDEOS: నెట్టింట్లో వైరల్: 7ఏళ్ల విద్యార్థిపై ట్యూటర్ దాడి..

Posted: 11/19/2018 12:41 PM IST
Aligarh tutor caught on camera beating 7 year old with shoe

రెండో తరగతి విద్యార్థి చేత హోమ్ వర్క్ చేయించడానికి హోమ్ ట్యూటర్ ఏం చేశాడో తెలుసా.? అత్యంత దారుణంగా విద్యార్థిని చావచితక బాదాడు. తన చెప్పులతో కోట్టాడు.. తాళం చెవిని విద్యార్థి వేళ్ల మధ్య పెట్టి చిత్రహింసలకు గురిచూయడం చెంపదెబ్బలు కొట్టడం చేశాడు. అంతేకాదు విద్యార్థి జుట్టు పట్టుకుని లాగడం, చెవిని నులిమేయడం, గోళ్లతో ఆ బాలుని ముఖాన్ని రక్కేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇలా సంపన్నుల బిడ్డలకు వారి ఇళ్లలోకే వెళ్లి ట్యూషన్ పాఠాలను చెప్పే ఓ ట్యూషన్ టీచర్ (హోమ్ ట్యూటర్) చేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ట్యూటర్ చేతితో దారుణ దాడికి గురైన చిన్నారి గత వారం రోజులుగా భయకంపితుడు కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు.. తమ పిల్లాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని అనుమానం కలిగింది. ట్యూషన్ చెప్పే గదిలోని సిసిటీవీ ఫూటేజీని పరిశీలిస్తే కానీ అసలు విషయం వారికి తెలియరాలేదు. దీంతో బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసి కేను నమోదు చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ‌నౌరంగాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే నౌరంగాబాద్‌కు చెందిన అమిత్ కుమార్ శర్మ కుమారుడు అనుజ్‌కుమార్ ఒక టీచర్ దగ్గరకు ట్యూషన్ కోసం వెళుతుంటాడు. ఈ నేపధ్యంలో ఆ టీచర్ బాలునిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి అమిత్ తన కుమారుడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో ఆ టీచర్ తన ఇద్దరు స్నేహితులతోపాటు అక్కడికి వచ్చి బాధిత బాలుని తండ్రితో రాజీకి ప్రయత్నించాడు. పైగా ఆ టీచర్‌కు ఒక స్థానిక నేత మద్దతుగా నిలిచారు. వారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు అడ్డుపడుతున్నారు. కాగా తన కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాలని ఆ తండ్రి వాపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tuition teacher  7 yr old student  naurangabad  beating minor  aligarh  CCTV  UP  Crime  

Other Articles