టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి, ఆంద్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా వుందని నందమూరి సుహాసిని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నగారి చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ కూతురిగా, యావత్ తెలంగాణ ప్రజలను తనను ఆడపడచులా ఆశీర్వదిస్తారని మరీ ముఖ్యంగా కుకట్ పల్లి ఓటరు మహాశయులు, కూటమి పార్టీల కార్యకర్తలు తనకు అండగా నిలుస్తారని పేర్కోన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నానని.. తాను కూడా ప్రజాసేవ చేయగలనన్న నమ్మకం, విశ్వాసంతో టిక్కెట్ కేటాయించి కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి బరిలో నిలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలని నందమూరి సుహాసిని చెప్పారు. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శనివారం నామినేషన్ దాఖలు చేస్తానని సుహాసిని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు చిన్నప్పటి నుంచీ ఉందని.. ప్రజలకోసం అనునిత్యం కష్టపడతానని చెప్పారు. ప్రముఖ సినీనటులు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్ని విషయాలపైనా రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ ఆశయాలకోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more