Respond to CVC report, SC to Alok Verma సివీసి నివేదికపై స్పందించండీ: అలోక్ వర్మతో సుప్రీం

Supreme court asks alok verma to respond to cvc findings

Central Bureau of Investigation, CBI, CVC, Alok Verma, Alok Verma’s petition, Central Vigilance Commission, Supreme Court, Rakesh Asthana, CVC probe report, VV Venugopal, CVC report, CBI Director Alok Verma, CJI Ranjan gagoi

The Supreme Court, in its October 31 order, had directed the CVC to probe corruption charges against Verma under the supervision of retired Supreme Court judge AK Patnaik, and submit its report in two weeks.

సివీసి నివేదికపై స్పందించండీ: అలోక్ వర్మతో సుప్రీంకోర్టు

Posted: 11/16/2018 04:02 PM IST
Supreme court asks alok verma to respond to cvc findings

కేంద్రప్రభుత్వం తనపై కక్ష్యగట్టి రాత్రికి రాత్రే తనను తొలగించి, బలవంతంగా సెలపువై వెళ్లమని అదేశించిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసు విచారణను ఇవాళ న్యాయస్థానం చేపట్టింది. గత నెల (అక్టోబర్ 31న) పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. పక్షం రోజుల వ్యవధిలో సీవీసీ ఈ వ్యవహారమై రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయవాది పట్నాయక్ సమక్షంలో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని అదేశించిన విషయం తెలిసిందే.  

కాగా ఒక్కరోజు అలస్యంగా ఇవాళ సీవీసి తన నివేదికను సీల్డు కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించింది. నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఆరోపణలపై సీవీసీ నివేదిక సానుకూలంగా ఉందని, అయితే, మరికొన్నింటిపై విచారణ అవసరమని పేర్కొంది. ఇదే సమయంలో సీవీసీ నివేదికపై తన స్పందన తెలియజేయాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ‌ను ధర్మాసనం కోరింది. దీనిపై నవంబరు 19లోగా స్పందించాలన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబరు 20కి వాయిదా వేసింది.

తన అభిప్రాయాలను సీల్డ్ కవర్‌లో అందజేసి సీబీఐకి ప్రజల్లో ఉన్న ప్రతిష్ఠను కాపాడాలని సూచించింది. అలోక్ వర్మ తరఫున న్యాయవాది ఫాలీ నారీమన్ హాజరయ్యారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనల్ తుషార్ మెహతాలకు సైతం సీవీసీ నివేదిక అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు సంబంధించిన విచారణ నివేదికను అందజేయడానికి మాత్రం నిరాకరించింది.

అలాగే సీబీఐ డీఎస్పీ ఏకే బస్సీ తన బదిలీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్, అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే దాఖలు చేసిన పిటిషన్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని గతంలోనే సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయిక్ పర్యవేక్షణలో సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ‌పై విచారణ నవంబరు 10న సీవీసీ పూర్తిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles