gali janardhan reddy bail petirion hearing on 12th గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా

Court adjourns hearing on gali janardhan reddy bail petirion to 12th

Janardhan Reddy, Mining Baron, bribery case, Karnataka High court, Bengaluru sessions court, Central Crime Branch, Ambidant Marketing Pvt Ltd, Ballerys mining baron, Karnataka Police, BJP former minister, crime

Mining Baron Gali Janardhana Reddy, who has been accused of bribing an Enforcement Directorate official, petitioned the sessions court in Bengaluru for an anticipatory bail, court adjourns it to 12 November.

గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా

Posted: 11/09/2018 09:03 PM IST
Court adjourns hearing on gali janardhan reddy bail petirion to 12th

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఓ ఈడీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అంబిడెంట్ అనే కంపెనీని కాపాడటానికి గాలి 57 కేజీల బంగారం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో ఈడీ అధికారికి రూ.కోటి లంచం ముట్టజెప్పినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిని విచారించేందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఈ కేసులోఅరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాలి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరులో సెషన్స్ కోర్టులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై కేసు దాఖలు చేశారనీ, ఇందులో తమ క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. ఆయనకున్న పాపులారిటీని, రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఈ చర్యలని పిటీషన్ లో పేర్కోన్నారు.

అరెస్టు చేస్తారని మీరు ముందుగానే ఊహించుకుంటున్నారా ? అంటూ గాలి న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరుపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన సీసీబీ పోలీసులకు.. అభ్యంతరాలు తెలుపుతూ కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సూచించింది. అయితే ఈ  బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో సీసీబి పోలీసులు గాలి జనార్థన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి కోసం నాలుగు బృందాలు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. రూ.600 కోట్ల కుంభకోణం కేసులో చిక్కుకున్న అంబిడెంట్ కంపెనీని ఈడీ విచారణ నుంచి కాపాడటం కోసం సెటిల్మెంట్ కు ప్రయత్నించి గాలి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఏకంగా ఈడీకి చెందిన ఉన్నతాధికారితో రూ.18 కోట్ల మేరకు డీల్ కుదర్చుకుని.. అందులో కోటి రూపాయాలను అందించారు. కాగా ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి దేశం దాటిపోకుండా ఇప్పటికే అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles