BJP’s candidate withdraws from contest, joins Congress ఉప ఎన్నికలకు ముందు బీజేపీ షాక్

Shock to bjp in bypoll chandrashekar withdraws from contest joins congress

Karnataka byelections, BJP, Congresss, Ramanagaram, L Chandrashekar, B.S. Yeddyurappa, D.K. Shivakumar, Congress

In a major setback to the Karnataka BJP, L. Chandrashekar, BJP candidate in the Ramanagaram Assembly constituency, retired from the electoral contest against JD(S) candidate Anita Kumaraswamy, wife of Chief Minister H.D. Kumaraswamy.

ఉప ఎన్నికలకు ముందు బీజేపీ షాక్: రేసు నుంచి తప్పుకున్న అభ్యర్థి

Posted: 11/01/2018 02:15 PM IST
Shock to bjp in bypoll chandrashekar withdraws from contest joins congress

కర్ణాటకలో అధికారంలో అందుకునే ప్రయత్నంలో బీజేపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వేసిన గాలం తాలుకు అడియోలు అందరికీ తెలిసిందే. బీజేపీలో చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు ఇస్తామని బీజేపి నేతల ఫోన్ కాల్స్ విన్నా.. అవి ఆచరణలో మాత్రం అమలుకాకపోవడంతో బీజేపి తన పరువు తీసుకుంది. ఇదే సమయంలో కర్ణాటకలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు లోక్ సభ స్థానాలకు ఈ నెల 3న జరగనున్న ఉప ఎన్నికలకు ముందు బీజేపి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది.

నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటూ వారి పాఠాన్ని వారికే అప్పజెప్పిందో ఏమో తెలియదు కానీ.. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు బీజేపికి కొలుకోలేని విధంగా దెబ్బతీసింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఉపఎన్నికల బరిలో రామనగరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో వచ్చిన ఎన్నికల నేపథ్యంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ బరిలో నిలవలేదు. అయితే బీజేపి సహా పలువురు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు మాత్రం ఇక్కడి నుంచి బరిల నిలిచారు.

ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం సతీమణి అనితా కుమారస్వామి బరిలో నిలిచారు. అమెకు బీజేపి అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ నుంచి ప్రధాన పోటీ వుండింది. అయితే కాంగ్రెస్ నడిపిన మంత్రాంగంతో ఆయన సరిగ్గా ఎన్నికలకు మరో రెండు రోజుల సమయం వుంది అన్న తరుణంలో బీజేపికి షాక్ ఇచ్చారు. తాను రామనగరం అభ్యర్థిగా బరిలో నిలవడం లేదని చెప్పడంతో పాటు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విధమైన పరిణామాంతో బీజేపికి చుక్కలు కనిపించాయి. కాగా, ఈ పూర్తి మంత్రాంగం వెనుక కర్ణాటక మంత్రి డి.శివకుమార్ తనదైన శైలిలో వ్యవహారాన్ని నడిపించారని తెలుస్తుంది.

స్వతహాగా కర్ణాటక ఎమ్మెల్సీ అయిన సీఎం లింగయ్య తనయుడైన చంద్రశేఖర్ ను బీజేపి గత నెల 10న తమ పార్టీలోకి సాదరంగా అహ్వానించి.. అయనను రామనగరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపింది. తమ పార్టీకి అంతగా అదరణ లేని రామనగరం నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని కూడా భావించి..ఆ మేరకు హామీని కూడా ఇచ్చింది. దీంతోనే చంద్రశేఖర్ బీజేపిలో చేరినట్లు సమాచారం. అయితే ఉపఎన్నికలలో పూర్తి మద్దతు, ప్రచారం కూడా కల్పిస్తామన్న బీజేపి.. ఎన్నికలకు మరో రెండు రోజులు వున్నా ఒక్క బీజేపి నేత కూడా ఇక్కడకు రాలేదని, ప్రచారం నిర్వహించలేదని, అందుచేతే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles