SC seeks pricing details on Rafale deal రాఫెల్ డీల్ లో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్..

Supreme court asks centre to submit details of pricing of 36 rafale fighter jets

Rafale deal, France, India, dassalut, Hindustan Aeronautics Limited, HAL, Rahul Gandhi, Congress, Supreme Court, Rafael fighter jets, Indian Air Force, Chief Justice Ranjan Gogoi, New Delhi

The Supreme Court asked the Centre for pricing details of the 36 Rafale fighter jets India is buying from France in a sealed cover within 10 days.

రాఫెల్ డీల్ లో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్..

Posted: 10/31/2018 02:41 PM IST
Supreme court asks centre to submit details of pricing of 36 rafale fighter jets

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించే ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఈ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించిన పిటీషన్లను విచారణకు స్వీకరించి ఈ వ్యవహారంలో కేంద్రానికి తొలిషాక్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా ఇవాళ రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలోని ధరలు, వ్యూహాత్మక వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

పదిరోజుల్లోగా రాఫెల్ యుద్ద విమానాలకు సంబంధించిన అన్ని వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్ సెట్ భాగస్వాముల వివరాలను కూడా అందించాలని ఆదేశించింది. అయితే యుద్ద విమానాల ధరల వివరాలు అత్యంత గోప్యమైనవని.. వాటిని పార్లమెంటులో కూడా వెల్లడించలేదని కేంద్రం వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. వాటిని బహిర్గత పర్చకుండా సీల్డు కవర్లో తమకు అందజేయాలని అదేశాలను జారీ చేసింది.

రాఫెల్ యుద్ద విమానాల ఒప్పంద వ్యవహాంలోని పూర్తి వివరాలను పబ్లిక్ డొమెన్ లో నిక్షిప్తం చేయాలని, అయితే వాటితో అత్యంత గోప్యమైనవి, వ్యూహాత్మకమైన వివరాలను మాత్రం పొందుపర్చాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మొత్తాన్ని కేవలం పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అదేశించింది.

యుద్ధ విమాన ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని... అందువల్ల వీటి ధరలను వెల్లడించడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనానికి తెలిపారు. రహస్య వివరాలను వెల్లడించడం సాధ్యం కాని పరిస్థితుల్లో వెల్లడించడం కుదరదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సైతం సుప్రీం సూచించింది. బహిర్గతం చేయలేని కీలక సమాచారాన్ని పిటిష్నర్లకు తెలియజేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.

న్యాయమూర్తులు వినీత్ దండా, మనోహర్ లాల్ శర్మలు దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించింది. ఇక రాఫెల్ ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మాజీ అర్థికశాఖ మంత్రి యశ్వంత్ సిన్హా సహా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను కొనసాగించేందుకు కొంత సమయం ఆగాలని సర్వన్నత న్యాయస్థానం తెలిపింది. సీబీఐలో నెలకొన్న పరిస్థితులు గందరగోళంగా ముందుగా సర్థుకున్న తరువాత మీ పిటీషన్ పై విచారణ పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafale deal  France  India  dassalut  HAL  Supreme court  Indian Air Force  

Other Articles