ఆపరేషన్ గరుడను ఆరుమాసాల క్రితమే వెలుగులోకి తీసుకువచ్చి.. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుబోతున్నాయో చెప్పిన ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ హీరో శివాజీని ఉద్దేశించి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీకి ప్రాణహాని ఉందని ఆమె హెచ్చరించారు. టీడీపీ నేతలు ఆయనను బలి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆపరేషన్ గరుడ వ్యవహారంలో హీరో శివాజీ మోసపోవద్దన్నారు. కుట్రలను పసిగట్టి శివాజీ జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీపార్వతి సూచనలు చేశారు.
హీరో శివాజీని కూడా చంపేసి ఆ నెపాన్ని వైసీపి అధినేత జగన్ పై వేయాలని టీడీపీ నేతలు కుట్రలు పన్నే అవకావశం వుందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కొంతకాలం క్రిందట ఆపరేషన్ గరుడ కుట్ర అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో అమె ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అరెస్టు చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో పాటు శివాజీపై పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. అయితే వైసీపీ నేతల డిమాండ్లపై హీరో శివాజీ స్పందించి అమెరికా నుంచే ఓ వీడియో మెసేజ్ కూడా పంపారు.
ఆపరేషన్ గరడ ప్రకారం తనకున్న సమాచారం మేరకు తాను చెప్పిన విషయాలనే రాష్ట్రంలో వైసీపీ నేతలు, బీజేపి నేతలు నిజం చేస్తున్నారని విమర్శించారు. ఇక పైపెచ్చు తనను మళ్లీ తప్పుబడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ, బీజేపి నేతలే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని, అసలు ఆ అవసరం ఎందుకు వచ్చిందని శివాజీ ప్రశ్నించారు. తాను బ్యాంకులని మోసగించానా?....రుణాలు ఎగ్గొట్టి అమెరికా వచ్చానా? అంటూ తనపై రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలని కోరుతున్న నేతలకు శివాజీ ఘాటుగా బదులిచ్చారు.
ఇక తాజాగా లక్ష్మీ పార్వతి హెచ్చరికల నేపథ్యంలోనూ స్పందించిన హీరో శివాజీ తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని అన్నారు. నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హీరో శివాజీ హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...తనకు ఆమెను చూస్తేనే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని హీరో శివాజీ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more