SpiceJet, IndiGo Offer Discount On Flight Tickets దీపావళి ఆఫర్.. రంగంలోకి విమానయాన సంస్థలు..

Spicejet indigo airasia india offer discount on flight tickets

Flight Ticket Booking,Flight ticket discount,Flight ticket offer,flight ticket,flight ticket offers,flight ticket price,flight ticket prices,flight ticket sale,Flight tickets,Flight tickets discount,Flight Tickets fares,Flight tickets offers, Civil Aviation, Air Asia, SpiceJet, Indigo, Diwali discount offer, Flight Tickets, Festive season sale, Business

Ahead of Diwali, airlines have recently announced a host of discounts on domestic and international flight tickets. SpiceJet is offering domestic flight tickets at a starting all-inclusive price of Rs. 888 under a limited-period 'Festive Season Sale',

దీపావళి ఆఫర్.. రంగంలోకి విమానయాన సంస్థలు..

Posted: 10/27/2018 01:13 PM IST
Spicejet indigo airasia india offer discount on flight tickets

దసరా, దీపావళి పండుగ పేరు చెప్పగానే ముందుగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు గుర్తుకువచ్చేంది డిస్కౌంట్ ఆపర్లు. ఈ పండగ సీజన్ ను సద్వినియోగం చేసుకునేందుకు దిగ్గజం ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు పండుగ ఆఫర్లను ప్రకటించి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుంటాయి. దసరా సీజన్ లో ఐదు రోజుల పాటు దీపావలి పండుగను పురస్కరించుకుని మరో ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక అఫర్లను ప్రకటించాయి. అయితే తాజాగా ఈ కామర్స్ సంస్థలకు తోడు ఇప్పుడు విమానయాన సంస్థలు కూడా రంగంలోకి దిగాయి.

ఈ పండుగ పర్వదినాలలో తమ టికెట్లు బుక్ చేసుకునే కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించాయి. చవక ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణికులను పెంచుకునే మార్గాన పడ్డాయి. చౌకధర విమానయాన సంస్థలుగా పేరొందిన ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు కస్టమర్ల కోసం దీపావళి ధమాక సేల్ అపర్లను ప్రకటించాయి. ఇండిగో విమానయాన సంస్త రూ.899తో దేశీయ ప్రయాణాలకు టికెట్లను ఆఫర్ చేయగా, తాజాగా మరో సంస్థ స్పైస్ జెట్ రంగంలోకి దిగింది.

దేశంలోని ఎక్కడికైనా అతి తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అందులో భాగంగా ఇండిగో కంటే తక్కువకే రూ.888కే టికెట్లను ఆపర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు ఆఫర్ల టికెట్లను విక్రయించనున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. ఇటీవల ఇండిగో రూ.899తో 10 లక్షల సీట్లను అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది.

ఇక ఎయిర్ ఏషియా ఇండియా కూడా దీపావళి పండగ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లాలన్న పండుగ సీజన్ డిస్కౌంట్ ఆఫర్ కింద ఏకంగా 70 శాతం రాయితీని ప్రకటిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ టిక్కెట్లపై రాయితీతో ప్రయాణించే అవకాశం వుంది. అయితే ఈ టికెట్లు ఈ నెల 28తో ముగియనున్నాయి. ఈ చౌకధర విమానయాన సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఏకంగా 754.11 లక్షల మంది ప్రయాణికులను దేశీయంగా తమ గమ్యస్థానాలను చేర్చిందని ఓ ఏవియేషన్ సంస్థ నివేదిక తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles