Rahul Gandhi and Congress leaders arrested సీబిఐ తీరుపై కాంగ్రెస్ అందోళన.. రాహుల్ అరెస్టు..

Modi panicked and acted against cbi chief rahul gandhi critisizes after arrest

Alok verma, Bharatiya Janata Party, CBI, CBI hearing in Supreme Court today, CBI hearing, Congress, congress nationwide protest, Central Bureau of Investigation, M Nageshwar Rao, Narendra Modi, Rahul Gandhi, Rahul gandhi arrest, congress top leaders arrest, Rakesh Asthana, supreme Court, retd judge patnaik, Delhi, CBI Head Quarters

Congress president Rahul Gandhi was detained and taken to the Lodhi Colony Police Station. The Congress president was leading a protest march against the CBI row.

ITEMVIDEOS: సీబిఐ పరిణామాలపై కాంగ్రెస్ దేశవ్యాప్త అందోళన.. రాహుల్ అరెస్ట్..

Posted: 10/26/2018 03:58 PM IST
Modi panicked and acted against cbi chief rahul gandhi critisizes after arrest

స్వతంత్ర ప్రతిపత్తి గల సీబిఐ సంస్థ డైరెక్టర్‌ అలోక్ వర్మను బలవంతంగా సెలవులపై పంపించడం.. రాజేష్ ఆస్తానను కేంద్రం వెనకేసుకుని రావడంతో ఈ సంస్థలో కమ్ములాటలకు దారి తీసని పరిణామాల తీరును తీవ్రంగా ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్త అందోళనను చేపట్టింది. సీబిఐ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సిబిఐ కార్యాలయాల వద్ద విపక్షాలు పెద్దయెత్తున నిరసనలు చేపట్టాయి.

సీబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని దయాళ్‌ సింగ్‌ కాలేజ్‌ వద్ద నుండి సిబిఐ ప్రధాన కార్యాలయం వరకు చేపట్టిన మార్చ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఆయనతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే.. జనతాదళ్ నెత శరద్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఓ వ్యానులో ఎక్కించిన పోలీసులు స్థానిక లోధీ కాలనీ పోలిస్ స్టేషన్ కు తరలించారు.

కాగా, అంతకముందు రాహుల్‌ మాట్లాడుతూ దేశప్రజల పాలిట తాను కాపలాదారుగా వుంటానన్న నరేంద్రమోడీ.. దేశ ప్రజల పాలిట దోపిడీదారుగా మారి.. అర్థిక నేరగాళ్లను దేశం నుంచి పంపుతూనే మరోవైపు సంపన్నుల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోని సిబిఐ, ఈడీ, ఐటీ ఎన్నికల కమిషన్ సహా ప్రతి సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వీటన్నీటి వెనుక ఒక పెద్ద కారణం చౌకీదారు దొంగగా మారటమేనని విమర్శల దాడి చేశారు.

దొంగగా మారి 30 వేల కోట్ల రూపాయలను అనిల్‌ అంబానీ జేబులో పెట్టారని అన్నారు. రాఫెల్ డీల్ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నందునే సీబిఐ చీఫ్ అలోక్ వర్మను అర్థరాత్రి ఒంటిగంటకు అఘమేఘాల మీద నిర్ణయం తీసుకుని సెలవుపై వెళ్లాలని బలవంతపెట్టారని రాహుల్ అన్నారు. మోడీ నిజాన్ని కొంతకాలం దాచగలరని, కొంత కాలం బయటకు రానీయకపోవచ్చునని, అయితే నిజం మాత్రం ఎన్నటికైనా బయటకు వస్తుందని అప్పుడు ఈ డ్రామాలు తేటతెల్లం అవుతాయని అన్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన సీబిఐ వ్యవహారంపై నిరసన కార్యక్రమంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతలు సీబిఐ కార్యాలయాల ఎదుట అందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ లో రాజ్ బబ్బర్ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజాభిత కార్యక్రమాలు చేయాల్సింది పోయి.. సంపన్నుల జేబులు నింపే కార్యక్రమాలకు తెర లేపుతున్నారని రాజ్ బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. దీంతో యూపీ పోలీసులు అతనితో పాటు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.



అటు తమిళనాడులో కూడా కాంగ్రెస్ నేతలు నరేంద్రమోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. చెన్నైలోని నుయగమ్ బక్కంలోగల శాస్త్రీ భవన్ వున్న  సీబిఐ కార్యాలయం ఎదుట ధర్నాలు ని కేవలం ప్రతీకార చర్యలకు వినియోగిస్తూ.. తనకు కావాల్సిన అర్థిక నేరగాళ్లను, ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనులను మాత్రం దేశాన్ని దాటిస్తున్నారని తమిళానడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరస్సార్ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గోన్నారు.

అటు ఒడిశాలోని భువనేశ్వర్, కర్ణాటకలోని బెంగుళూరులో కాంగ్రెస్ అందోళనలు నిర్వహించింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా సీబిఐ వ్యవహరం, రాఫెల్ డీల్ లో జరిగిన అవినీతిపై రాష్ట్ర స్థాయి నేతలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించడం వల్లే సీబీఐ లాంటి సంస్థలో ఇద్దరు అధికారుల మధ్య ఇలాంటి తారతమ్యాలు ఏర్పాటు తారాస్థాయికి చేరి.. యావత్ దేశ ప్రజల విశ్వాసాలు సన్నగిల్లేలా చేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

రాఫెల్ డీల్ ఒప్పందంలో ఒక్క విమానం వెనుక 11 వందల కోట్ల రూపాయల దేశ ప్రజల డబ్బును కాజేసి.. అంబానీల జేబు నింపుతున్నారని రఘువీరా రెడ్డి అరోపించారు. ఈ విషయంలో విచారణ చేస్తున్నందునే సీబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను అర్థరాత్రి నిర్ణయం తీసుకున్న ప్రధాని ఆయనను బలవంతంగా సెలవుపై వెళ్లాలని అదేశించారన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alok verma  BJP  CBI  Supreme Court  Congress  protest  Rahul Gandhi  arrest  CBI Head Quarters  Delhi  

Other Articles