Attack on YS Jagan condemned by party leaders జగన్ పై దాడిని ఖండించిన పార్టీ ప్రముఖులు

Governor esl narsimhan called ap dgp enquired on ys jagan health

YS Jagan, YS Jagan attacked, YS Jagan Pawan Kalyan, ys jagan vizag airport attack, YS Jagan Governor, YS Jagan Mohan Reddy, Governor Narsimhan, YS Jagan, roja, GVL narsimha rao, chinarajappa, nara lokesh, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

After a waiter in vishakapatnam airport attacked the YSRCP chief Jagan, Governor ESL Narsimhan called AP DGP and enquired on YS Jagan Health and also ordered a deatiled report on the incident.

జగన్ పై దాడి: డీజీపికి ఫోన్ చేసి ఆరా తీసిన గవర్నర్

Posted: 10/25/2018 03:33 PM IST
Governor esl narsimhan called ap dgp enquired on ys jagan health

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిపై ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై వివరాలు ఆరా తీసేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపి ఆర్పీ ఠాకూర్ కు ఫోన్ చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను గవర్నర్‌ నరసింహన్‌ డీజీపీని అడిగి తెలుసుకున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన డీజీపీని ఆదేశించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఖండించారు. విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్న జగన్ పై దుండగుడు కత్తితో దాడి చేయడాన్ని ఆయన పిరికిపంది చర్యని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆధునిక సమాజంలో ఇటువంటి పిరికిపంద చర్యలకు స్థానం లేదని అన్నారు. మరో మంత్రి జవహార్ కూడా ఈ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదని అన్నారు. కేంద్ర బలగాల అధీనంలో వుండే ఎయిర్ పోర్ట్ లోపలికి ఓ వ్యక్తి కత్తిని ఎలా తీసుకెళ్లగలిగారని ప్రశ్నించారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జగన్ పై జరిగిన దాడిపై స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పారు. ఎంతో సురక్షితమైన ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పారు. దాడికి యత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జిరిగిన దాడిని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది అమానుష చర్యగా ఆయన పేర్కోన్నారు. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామంలో ఇలాంటి దాడులకు తావులేదని జనసేనాని అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి దాడులను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  Governor  GVL narsimha rao  pawan kalyan  nara lokesh  crime  

Other Articles