HC Upholds Disqualification of 18 MLAs దినకరణ్ వర్గానికి షాకిచ్చిన హైకోర్టు..

Hc upholds disqualification of 18 ttv camp mlas

TTV Dinakaran, K Palaniswami, P Vetrivel, Justice Vimala, assistant public prosecutor, AIADMK government, Justice Huluvadi G Ramesh, Justice Sathyanarayanan, VK Sasikala, P Dhanapal, 18 mlas disqualification, tamil nadu, politics

In a big relief to the K Palaniswami government, the Madras High Court on Thursday upheld the June 14 order of disqualifying 18 rebel AIADMK MLAs.

దినకవరణ్ వర్గ ఎమ్మెల్యేల అనర్హత సమర్థించిన హైకోర్టు

Posted: 10/25/2018 11:28 AM IST
Hc upholds disqualification of 18 ttv camp mlas

అన్నాఢిఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అన్నాడీఎంకేలోని పలు వర్గాలు తమ అధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇక బ్రేక్ పడిందా.? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అమ్మ మరణంతో అమె నిచ్చెలి శశికళ బంధువు తన అదిపత్యంలోకి పార్టీని తీసుకున్నా.. ఆ తరువాత కేంద్రం వెనక నిలిచి పావులను కదిపిందన్న తెర వెనుక కథనాలు వినిపించినా.. ఎట్టకేలకు పళనిస్వామి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్నారు.

అయితే అన్నాడీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు మద్దుతును ప్రకటించడం.. వారంతా పళనిస్వామిని వ్యతిరేకించడంతో వారిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. దీనిపై దినకరణ్ వర్గం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఇవాళ దీనిపై తీర్పును వెలువరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం దినకరణ్ వర్గానికి షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై స్పీకర్ వేసిన అనర్హత వేటును న్యాయస్థానం సమర్థించింది. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటను మిగిల్చింది.

కాగా, ఈ 18 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని తమిళనాడు మంత్రి ఒకరు వెల్లడించారు. అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా తీర్పుపై అటు ప్రభుత్వవర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ తీర్పును స్వాగతించాయి. కాగా దినకరణ్ మాత్రం ఇది తమకు అపజయం కాదని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం తీర్పుతో తమ ఎమ్మెల్యేలు ఎన్నికలకు వెళ్లి మరోమారు ప్రజల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దంగా వున్నారని అన్నారు.

అయితే ఎన్నికలకు వెళ్లాలన్న తన నిర్ణయానికి,, వారందరితో కలసి సమావేశమైన తరువాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది తమకు ఒక అనుభవంగా చెప్పుకోచ్చిన ఆయన పార్టీ పునరుద్దరణ, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామని చెప్పారు. ఇక దినకరణ్ వర్గం తరపున న్యాయస్థానం తీర్పు ఇలా రావడానికి జస్టిస్ విమల కారణమని, అమె కొడలుకు పళనిస్వామి ప్రభుత్వం ఇటీవల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడంతోనే ఇలాంటి తీర్పు వెలువరించిందని కూడా అరోపణలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles