Ajaz Khan says it's a conspiracy దూకుడు సైడ్ విలన్ పై డ్రగ్స్ కేసు

Actor ajaz khan in police custody for possession of narcotic substance

Bigg Boss, Ajaz Khan arrested, Ajaz Khan drug possession, Ajaz Khan in police custody, Ajaz Khan calls arrest cospiracy, Navi Mumbai, Drugs case, Dookudu, Badshah, ajaz khan arrest, Ajaz Khan, crime

Former Bigg Boss contestant Ajaz Khan has denied allegations that Navi Mumbai's Anti-Narcotics Cell found eight ecstasy tablets from his possession, and termed it as a "conspiracy planned by biggies, media and haters."

కుట్రపూరితంగా నాపై డ్రగ్స్ కేసు: నటుడు అజాజ్ ఖాన్

Posted: 10/24/2018 02:21 PM IST
Actor ajaz khan in police custody for possession of narcotic substance

‘దూకుడు’ చిత్రంలో సైడ్ విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ను మాదకద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కాగా తనపై కుట్రపూరితంగానే పోలీసులు కేసు బనాయించారని నటుడు అరోపిస్తున్నాడు. తానంటే గిట్టని కొందరు పెద్దలు, మీడియాతో చేతులు కలిపి.. తనపై కుట్రపూరితంగానే ఈ కేసును బనాయించారని పేర్కోంటున్నాడు. తాను మంచి కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ తరహా కుట్రతో తనను అన్యాయంగా ఇరికించారని అన్నాడు.

కాగా, దూకుడు చిత్రంలో ప్రధాన విలన్ సోనూసూద్ తమ్ముడి పాత్ర పోషించిన అజాజ్ ఖాన్ ను పోలీసులు అరెస్టుచేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద రూ.2.2 లక్షల విలువచేసే మాదకద్రవ్యాలు కూడా వున్నాయి. నవీ ముంబైలోని బేలాపూర్లో ఉన్న ఓ హోటల్ లో అజాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక అలస్యం చేయకుండా అజాజ్ ను కోర్టులో హాజరుపరచగా అతనికి రెండు రోజుల పోలీస్ కస్టడీని విధించారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కుట్ర చేసి కేసులో ఇరికించారని అజాజ్ అంటున్నాడు. అంతేకాకుండా తనను సమర్థించుకుంటూ అజాజ్ ఒక ట్వీట్ కూడా చేశాడు. ‘జొమాటో డెలివరీ బాయ్స్ కు సహాయం చేస్తే అది నేరం. నేనొక నేరస్థుడిని. తప్పులు చేసే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే అది నేరం. నేనొక నేరస్థుడిని. బడా బాబులు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర ఇది. నేనేంటో నా కుటుంబానికి తెలుసు. అల్లా నా వెంట ఉన్నాడు’ అని అజాజ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.

అజాజ్ అరెస్టు గురించి నవీ ముంబై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) తుషార్ దోషి స్పందిస్తూ.. ‘పక్కా సమాచారం ప్రకారం బెలాపూర్ లోని హోటల్ పై దాడి చేసి ఓ గదిలో ఉన్న 38 ఏళ్ల నటుడు అజాజ్ ఖాన్ ను అరెస్టు చేశామని చెప్పారు. ముంబైలోని అంథేరిలో నివాసముండే అజాజ్ ఖాన్.. టాబ్లెట్ల రూపంలో ఉన్న నార్కోటిక్ డ్రగ్ ను తీసుకుంటుండగా అతన్ని అరెస్టు చేశామని వెల్లడించారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేసినట్లు నవీ ముంబై పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, అజాజ్‌పై పోలీస్ కేసు కొత్తేమీ కాదు. 2016లో 36 ఏళ్ల హెయిర్ స్టైలిస్ట్‌కు అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపి అరెస్ట్ అయ్యాడు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అజాజ్ తెలుగులో మొత్తం ఏడు సినిమాల్లో నటించాడు. దూకుడు, నాయక్, బాద్‌షా, హార్ట్ ఎటాక్, వేట, టెంపర్, రోగ్ చిత్రాల్లో అజాజ్ నెగిటివ్ రోల్స్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajaz Khan  Drugs case  Dookudu  Badshah  ajaz khan arrest  Navi Mumbai  crime  

Other Articles