Team probing case against Rakesh Asthana transferred సీబిఐ అధికారుల కార్యాలయాలపై దాడులు..

Big reshuffle in probe team tarun gauba to investige on charges against rakesh asthana

CBI, nageshwar rao, Tarun Gauba, V Murugesan, Satish Dagar, bribery allegation, alok sharma, rajesh asthana, Central Bureau of Investigation, CBI, deputy SP, Devender Kumar Singh, bribery allegation, Arrest, CBI Special Director, Rakesh Asthana, meat exporter, Moin Qureshi. middleman, PM Modi, PMO Office, summons, Amit shah, Odisha, Crime

The latest development in the case is Tarun Gauba, who had earlier probed the Dera Sacha Sauda case, will now investigate allegations against Asthana. Other than Gauba, SP Satish Dagar and Joint Director V Murugesan will probe charges against Asthana.

సీబీఐ తాత్కలిక డైరెక్టర్ సంచలన నిర్ణయాలు.. పాత టీమ్ బదిలీ..

Posted: 10/24/2018 01:19 PM IST
Big reshuffle in probe team tarun gauba to investige on charges against rakesh asthana

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన తెలుగుతేజం, ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు నిన్న అర్థరాత్రి రెండు గంటల సమయంలోనే తన బాధ్యతలను స్వీకరించారు. ఇలా బాధ్యతలను స్వీకరించిన ఆయన వెనువెంటనే తమ స్వయం ప్రతిపత్తి సంస్థలో అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్న సీనియర్ అధికారులకు జలక్ ఇచ్చారు. అంతేకాదు.. సదరు అధికారుల కింద పనిచేసిన దిగువశ్రేణి అధికారులకు కూడా నాగేశ్వరరావు తన మార్కును చూపిస్తున్నారు.

స్వయం ప్రతిపత్తి సంస్థగా వున్న సీబిఐ ప్రతిష్టను మసకబారేట్లు చేసి.. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న తరుణంలో బాధ్యతలను చేపట్టినా నాగేశ్వార రావు రాకేశ్ అస్థానా, అలోక్ వర్మకు చెందిన బృందం సభ్యులను వివిధ ప్రాంతాలకు బదిలీతో చెక్ పెట్టారు. వీరి కింద మొత్తం 13 మంది కీలక అధికారులను బాధ్యతలను నిర్వహించగా వారందరినీ నాగేశ్వర రావు ట్రాన్స్‌ఫర్ చేశారు. సీబీఐలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు ఆయన ఈ చర్యలు తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి.
 
సీబీఐ డైరెక్టర్‌‌గా ఉన్న అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా సెలవులో వెళ్లాల్సిందిగా డీవోపీటీ కోరిన విషయం తెలిసిందే. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 2 గంటలకే సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి, విధులకు హాజరయ్యారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

10,11 అంతస్థుల్లోని అలోక్ వర్మ, రాకేష్ అస్థానా గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఆ తరువాత రెండు గదులను సీజ్ చేశారు. ఈ క్రమంలో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలకు పారిపోయిన అర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు  సహకరించిన కొందరు అధికారులను వివరాలతో పాటు పక్కా అధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మాల్యా పలాయనానికి ఒక్క రోజు ముందు ఆయనపై ఉన్న లుకౌట్ నోటీస్ ను డీగ్రేడ్ చేస్తూ సీబీఐ వెలువరించిన ఉత్తర్వుల కాపీని ఆయన స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

మాల్యా పారిపోవడానికి నిర్ణయించుకున్న తరువాత తన పరపతితో లుకౌట్ నోటీసుల తొలగింపునకు ప్రయత్నించగా, అందుకు సహకరించిన కొందరు సీబీఐ అధికారులపై ఆస్థానా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆస్థానా చేసిన విచారణలో వెల్లడైన నిజాలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా ఈ తనిఖీల్లో నాగేశ్వరరావు కంట బడినట్టు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడంపై అలోక్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను సెలవుపై పంపించడాన్ని ఆక్షేపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  nageshwar rao  Tarun Gauba  V Murugesan  Satish Dagar  bribery allegation  rajesh asthana  Crime  

Other Articles