Vajpayee’s niece Karuna Shukla to take on Raman Singh రమణ్ సింగ్ పై పోటీగా బరిలో వాజ్ పాయ్ కోడలు..!

Chhattisgarh ab vajpayee s niece to take on raman singh

Chhattisgarh polls, Raman Singh, Chhattisgarh Congress, Chhattisgarh assembly elections, assembly elections in Chhattisgarh, Chhattisgarh CM, Raman singh, congress, BJP, Karuna Shukla, Amit Shah, chhattisgarh, politics

Former PM Atal Bihari Vajpayee’s niece Karuna Shukla, a former BJP MP, is emerging as the candidate to contest against chief minister Raman Singh from Rajnandgaon constituency during next month’s elections in Chhattisgarh.

బీజేపి ముఖ్యమంత్రిపై పోటీగా బరిలో వాజ్ పాయ్ కోడలు..!

Posted: 10/22/2018 03:56 PM IST
Chhattisgarh ab vajpayee s niece to take on raman singh

దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అంశాన్ని కూడా ఎన్నికలలో ప్రచారాస్త్రాంగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ పేరుతో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఈ నెల రాష్ట్రానికి వచ్చిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తమ పార్టీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అంతిమ సంస్కారాల్లో బాగంగా ఐదు కిలోమీటర్ల మేర నడిచామని, అది తమకు ఆయన పట్లవున్న గౌరవానికి నిదర్శమని చెప్పుకోచ్చారు.

అయితే ఇదే విషయాన్ని మాత్రం ఛత్తీస్ గఢ్ లో ప్రస్తావించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానిగా కొనసాగుతున్న హాయంలో తన పిలుపుతో కొందరు ఎంపీలను తన పార్టీ వైపుకు అకర్షించే అవకాశం వున్నా.. తాను కట్టుబడిన, నమ్మిన సిద్దాంతాలకు వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టంలేక.. కేవలం ఒక్క ఓటుతో అధికారాన్ని చేజార్చుకున్నారు ఆయన. అయితే తన ఓటమినే అస్త్రంగా మార్చుకున్న.. దానినే ప్రచారం చేసిన ఆయన మరోమారు ప్రజల్లోకి వెళ్లడంతో దేశప్రజలకు ఆయనకు అధికారాన్ని అందించారు.

అలా ఆయన నమ్మిన, ఆచరించిన సిద్దాంతాల బాటలోనే పయనించింది ఆయన మేనకొడలు కరుణా శుక్లా. జాంగీర్ నియోజకవర్గం నుంచి బీజేపి పార్లమెంటు సభ్యురాలిగా ప్రతినిధ్యం వహించిన ఆమె.. 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థఇ డాక్లర్ చరణ్ దాస్ మహంత్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటికే వాజ్ పాయ్ కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా వున్న క్రమంలో అమెను కూడా బీజేపి అధిష్టానం దూరం పెట్టింది. దీంతో బీజేపి అధిష్టానంపై కలత చెందిన ఆమె.. తన మేనమామ ఉన్నప్పటి సిద్దాంతాలు పార్టీలో లేవని అమె ఏకంగా కాంగ్రెస్ లో చేరారు.

అంతేకాదు.. మరో నెల రోజుల వ్యవధిలో జరగనున్న చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో అమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఏకంగా చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పైనే ఆమె పోటీ చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. రమణ్ సింగ్ ప్రాతినిథ్య వహిస్తున్న రాజ్ నంద్ గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమె బరిలో నిలిపేందుకు రమారమి అంతా ఖారారైపోయింది. అయితే కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ అమోదముద్ర వేయడమే తరువాయని సమాచారం. వాజ్ పాయ్ పైనున్న గౌరవంతోనే కరుణాశుక్లాను పక్కనబెట్టారా..?అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh CM  Raman singh  congress  BJP  Karuna Shukla  Amit Shah  chhattisgarh  politics  

Other Articles