young girls hulchul at film nagar డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుకైన యువతులు..

Young girls hulchul at film nagar at drunk and drive test

young girls, rich girls, drunk and drive, banjara hills, jubilee hills, film nagar, hyderabad police, telangana, crime

young girls who had were in inebriated condition had been caught by hyderabad police at drunk and drive test conducted at film nagar, had urgued with police to alcohol test.

మద్యం తాగి బుకైన యువతులు.. పోలీసులకు చుక్కలు

Posted: 10/22/2018 12:25 PM IST
Young girls hulchul at film nagar at drunk and drive test

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం మత్తులో ఉన్న యువతులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు ఆల్కహాల్ టెస్టు చేయించుకునేందుకు ససేమిరా అన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు అంగీకరించలేదు. వారితో వాగ్వాదానికి దిగి నానా రభస చేశారు. చివరికి విసిగిపోయిన పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువతులను ఆపారు. మహిళా కానిస్టేబుల్‌ ద్వారా శ్వాసపరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాహనం నడుపుతున్న యువతి సహకరించలేదు. వాగ్వాదానికి దిగింది. వెనుకాల ఉన్న యువతి వదిలేయాలంటూ పోలీసులను కోరింది. చివరకు అరగంట తరువాత శ్వాస పరీక్ష నిర్వహించగా ఆమె మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది.
 
కారులో వచ్చిన మరో యువతి కూడా ఇదే విధంగా ప్రవర్తించింది. పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగింది. శ్వాస పరీక్షలకు సహకరించకపోవడంతో శాంతిభద్రతల పోలీసులు రంగంలోకి దిగి ఆమెకు పరీక్షలు చేశారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసుకొని వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాగా, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో మొత్తం 112 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఇందులో 65 బైక్‌లు, 5 ఆటోలు, 42 ఫోర్ వీలర్ల వాహనాదారులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles