tirumala bramostavam concludes with chakra snanam ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

Tirumala bramostavam concludes with chakra snanam

Lord Venkateswara bhramostavam, srivari bramostavam, chakra snanam, swarna ratham, Dasara festival celebrations, Vijayawada, Gayatri devi, Navaratri fest, simha vahanam, muthyala pandiri, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m, chinna shesha vahanam, Hamsa vahanam

Atop Trimala hills diety lord Sri Venkateshwara swamy Annual Navaratri brahmotsavam concludes with today with chakra snanam, in which thousands of devotees had taken part.

ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

Posted: 10/18/2018 11:18 AM IST
Tirumala bramostavam concludes with chakra snanam

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున చక్రస్నానంతో ముగింపుకు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై నిర్వహించిన ఊరేగింపుతో వాహనసేవలు ముగింపుకు చేరుకున్నాయి. తిరుమల నవరాత్రి  బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేకువ జామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవీ, భూదేవీ సమేత మళయప్ప స్వామివారు వరాహ పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు.

అక్కడ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పెద్దజీయార్ సమక్షంలో అర్చకులు చక్ర తాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్య స్నానాలను ఆచరించి తన్మయత్నానికి లోనయ్యారు. స్వామివారికి చక్రస్నానం నిర్వహించిన సమయంలో తాము కూడా అదే పుష్కరిణిలో స్నానాలు అచరించడం వల్ల తమలోని శారీరిక, మానసిక రుగ్మతలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం.

మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా మళయప్ప స్వామిని వేకువ జామునే అర్చకులు ఊరేగింపుగా వరాహ పుష్కరిణి చెంతకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని ముగించారు. దీంతో గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోనేటిరాయుడు శ్రీవారి బ్రహోత్సవాలకు ముగింపుకు చేరుకున్నాయి. మరోవైపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామి శిరస్త్రాణాన్ని ధరించి, ఖఢ్గం చేతపట్టి యుద్ధ వీరునివ‌లె అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రధానం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lord Venkateswara bramostavam  Dasara bramostavam  tirumala  chakra snanam  vahana seva  

Other Articles