East Godavari former mlas join Janasena జనసేనలోకి తూర్పుగోదావరి మాజీ ఎమ్మెల్యేలు

Pawan kalyan to take up durga matha deeksha from tomorrow

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, polavaram, east godavari former mlas, rapaka varaprasad, pamula rajeshwari, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan durgamatha pooja, durgamatha deeksha, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says that todays politics has become thousand crores business rather than service to people.

రాజకీయం వ్యాపారమైందని పవన్ కల్యాణ్ ఆందోళన..

Posted: 10/08/2018 12:01 PM IST
Pawan kalyan to take up durga matha deeksha from tomorrow

ప్రస్తుతం దేశంలో రాజకీయం కూడా వ్యాపారంగా మారిపోయిందని, రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టడంతో వేల కోట్ల రూపాయలను అర్జించేందుకు ఆయా పార్టీల నేతలు పునాదులు వేసుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. అంతేతప్ప.. ప్రజాసేవకు ఎలా చిత్తశుద్దితో కృషి చేయాలన్న విషయాన్ని మర్చిపోతున్నారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు కూడా స్వార్థంతో వ్యవహరిస్తే.. ఇక ప్రజల బాగోగులు ఎవరికి పడతాయని ఆయన ప్రశ్నించారు.

రాజకీయాలను సమూలంగా ప్రక్షాలన చేయాల్సిన అవసరం వుందని చెప్పే మేధావులు.. కూడా ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే వరకు వేచిచూడకుండా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ సూచించారు. ఇక తన పార్టీలో చేరిన వారికి సీటు కేటాయిస్తే ఎంత మేరకు ఖర్చు చేస్తారా.? అన్న ప్రశ్న కన్నా ముందు.. ప్రజలతో మమేకమై పనిచేస్తారా.? లేదా.? అన్న ప్రశ్నే తొలుత తనలో ఉదయిస్తుందని అన్నారు. పార్టీలో చేరతామంటే ఎంతిస్తారు.? ఎంత ఖర్చు చేస్తారు అన్న సంస్కృతి దశాబ్దాల కాలంగా పాతుకుపోయిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

మన ప్రాంత ప్రజల కోసం ఆలోచించిన సర్ ఆర్థర్ కాటన్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారని, ఇప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే ఎంత డబ్బు సంపాదించవచ్చని ఆలోచిస్తున్నారని.. పనిలో మార్పు లేదు కానీ, ఆలోచనా విధానంలోనే మార్పులు వచ్చాయని అన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాల్సిన పరిస్థితుల్లో ఒక్కోసారి కత్తి కూడా అవసరం కావచ్చని పవన్ అన్నారు. మంచి మాట చెబితే విననప్పుడు క్రమశిక్షణలో పెట్టడం కూడా తెలియాలని సూచించారు.

దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో అమ్మవారి దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న ఈ నెల 10న ఉదయం దేవీ పూజ చేసిన అనంతరం దీక్షను స్వీకరించనున్నారు. తొమ్మిది రోజులపాటు కొనసాగనున్న ఈ దీక్షలో పవన్ పండ్లు, పాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పవన్ ప్రతి ఏడాది చాతుర్మాస దీక్ష చేసేవారు. ఇప్పుడు అమ్మవారి దీక్ష చేపట్టనున్నట్టు పవన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  polavaram  andhra pradesh  politics  

Other Articles