7 Haryana policemen booked on rape charges తల్లికూతుళ్లపై 2 నెలలుగా 18మంది అత్యాచారం..

7 haryana policemen booked for raping minor her mother for 2 months

Haryana Police, booked, Rape, mother, Minor, kaithal, Indian Penal Code, Kalayat police station, Kaithal SP Astha Modi, ASI Shamsher Singh, Roshan Lal and Dhanpati, exempted ASI Bajir Singh, head constable Randeep and constables Dilavar, Isham Singh, crime

Haryana Police booked 18 persons, including seven police personnel, for allegedly repeatedly raping a minor girl and her mother for almost two months in a village near Kalayat town of Kaithal district.

తల్లికూతుళ్లపై 18మంది అత్యాచారం.. నిందితుల్లో పోలీసులు, సర్పంచ్..

Posted: 10/04/2018 01:19 PM IST
7 haryana policemen booked for raping minor her mother for 2 months

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రజలకు బాసటగా వుండాల్సిన గ్రామ ప్రధమ పౌరులు.. రక్షకభటుటు అందరూ కలసి కంచే చేను మేసిన చందంగా వ్యవహరించి దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ లతో పాటు మరో 16 మంది తల్లికూతుళ్లపై రెండు నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డారు. హర్యానాలోని కైథాల్ కలాయత్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఓ తల్లి, ఆమె 15 ఏళ్ల మైనర్ కూతురిపై 18 మంది కామాంధులు రెండునెలలుగా సామూహికంగా అత్యాచారం జరిపిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అత్యాచారం జరిపిన కామాంధుల్లో ఏడుగురు హర్యానా పోలీసులు కూడా ఉండటమే సంచలనాకి కారణమైంది. అది కూడా కానిస్టేబుళ్లతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, వీరిలో విధుల్లోంది తప్పించిన మరో ఏఎస్ఐ కూడా వుండటం గమనార్హం. బాధిత మైనర్ బాలిక ఫిర్యాదు మేర పోలీసులు 18 మంది కామాంధులపై కేసు నమోదు చేశారు.

నిందితుల్లో ఏడుగురు పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు కూడా ఉన్నారని కైథాల్ జిల్లా ఎస్పీ అస్తామోదీ చెప్పారు. నిందితుల్లో ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. కాగా ప్రథాన నిందితుడు షంషేర్ సింగ్ వాదన మాత్రం భిన్నంగా వుంది.

బాధిత కూతురు తండ్రి ఓ న్యాయవాది అని.. మూడు నెలల క్రితం తమ తండ్రిపై కూడా లైంగిక దాడి కేసును నమోదు చేశారని, ఆయన ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని అరోపించారు. ప్రస్తుతం తమపై కుట్రపూరితంగా రేప్ కేసులు నమోదు చేసిందని అన్నారు. ఈ విషయంలో గతంలో తన తండ్రిపై పెట్టిన కేసులో అమె ఇచ్చిన లిఖితపూర్తక పిర్యాదులోనే స్పష్టమైందని, గ్రామంలోని ప్రముఖులే తనను, తన తల్లిని పోలీసులను ఆశ్రయించకుండా అడ్డుకున్నారని పేర్కోన్నారని.. ఏఎస్ఐ షెంషేర్ సింగ్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana Police  Gangrape  Rape  mother  Minor  kaithal  Kalayat police station  ASI Shamsher Singh  crime  

Other Articles