IMD issues red alert for Kerala కేరళవాసుల్ని వణికిస్తున్న మరో తుఫాను..

Another danger bell to kerala red alert issued in 3 districts

Kerala Floods, Kerala Rains, Kerala weather forecast, IMD, Pathanamthitta, Idukki, Wayanad, Palakkad and Thrissur, Pinarayi Vijayan, arabian sea, another storm, heavy rains, very heavy rains, red alert to 3 districts

Heavy to very heavy rain is likely to occur in the next three or four days in Kerala, the Indian Meteorological Department said, a low pressure is likely to form over southeast Arabian sea on October 5 and it is likely to concentrate into a depression.

కేరళవాసుల్ని వణికిస్తున్న మరో తుఫాను.. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్..

Posted: 10/04/2018 12:31 PM IST
Another danger bell to kerala red alert issued in 3 districts

కనీవిని ఎరుగని రీతిలో సుమారు వందేళ్ల తరువాత వచ్చి నిండా ముంచి వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేరళవాసులను మరో పిడుగులాంటి వార్త వణికిస్తుంది. సర్వం కోల్పోయిన కేరళవాసులపై ఇంకా ప్రకృతి ప్రకోపం చాలరినట్లు లేదు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్న తరుణంలో మరో వార్త వారిని నిలువరించగా, కేరళవాసులు మాత్రం ఈ వార్తను తెలుసుకుని గజగజ వణుకుతున్నారు.

కేరళపై మరోమారు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అరేబియా సముద్ర తీరం, శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళతోపాటు తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ అధికారులను అప్రమత్తం చేశారు.

ఆదివారం నుంచి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల ముఖ్యమంత్రి మూడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. జాతీయ విపత్తు దళాన్నిఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ సహాయ శిభిరాలను ఏఱ్పాటు చేయాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు.

సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులు ఐదో తేదీలోపు తీరానికి చేరుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు పర్యాటకులు రాకపోవడమే మంచిదని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి ఈ నెల 8వ తేదీకల్లా అల్ప పీడనంగా మారుతుంది. అనంతరం అది బలపడి భారీ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Rains  weather forecast  IMD  Pinarayi Vijayan  arabian sea  kerala floods  

Other Articles