Balakrishna effigy flexi set on fire by his fans

Nandamuri balakrishna, Balayya fans, Balakrishna flexies, Madhira, Khammam tour, viral video

Actor turned politician, Hindupur MLA bala krishna's effigy and flexi's set on fire by his fans as they were hurt by nandamuri heros attitude

బాలయ్య దిష్టిబోమ్మ దహనం చేసిన అభిమానులు

Posted: 10/01/2018 09:01 PM IST
Balakrishna effigy flexi set on fire by his fans

అభిమాన నటుడు తెరపై కనిపిస్తే చాలు.. ఎగిరి గంతేస్తారు అభిమానులు.. అలాంటిది ప్రత్యక్షంగా కనిపిస్తే ఆగుతారా? వెంటనే అభిమాన హీరో వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్, సెల్ఫీ దిగి ముచ్చట తీర్చుకుంటారు. కొన్నిసార్లు అభిమానం మితిమీరినప్పుడు అభిమాన హీరోకు కూడా చిర్రెత్తుకువస్తుంది. గతంలో అభిమానుల దూకుడుతో అసహనానికి గురైన సినీహీరో నందమూరి బాలకృష్ణ వారిని కొట్టిన సందర్భాలు ఎన్నో చూశాం.

అయితే సమయం ఎప్పుడు ఒకేలా వుండదు. సినీనటుడిగా ఎలా వున్నా.. రాజకీయ నేతగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు కాసింత సహనం అధికంగా వుండాలి. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచార వేళ.. తప్పకుండా అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. అలా కాకుండా తన దారి.. అంటూ అదే పంథాలో వ్యవహరిస్తే.. మధిరలో జరిగిన పరిణామాలే ఎదురవుతాయి. వేనోళ్ల పొడిగిన అభిమానులే.. తమ అభిమానాన్ని చంపుకుని.. అభిమాన హీరో ఫ్లెక్సీలను, పొస్టర్లను చించివేశారు.

ఎక్కడా.. ఎప్పుడు అంటున్నారా.. తాజాగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య అక్కడ అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అవిష్కరించారు. మధిర నుంచి మహాకూటమి తొలి విజయం అందుకుంటుందని కూడా చెప్పారు. అయితే ఈ పర్యటనలో బాలయ్య సహనానికి అభిమానులు మరో పరీక్ష పెట్టారు. అప్పటికే ఉక్కపోతతో చొక్కా విప్పేసి ర్యాలీలో పాల్గొన్న బాలకృష్ణకు అభిమానుల తాకిడితో మరింత అసహనానికి గురయ్యారు.

ఈ క్రమంలో తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద వాహనంలో నుంచి కిందకు దిగి ఓ అభిమానిని  కాలితో తన్నినట్టు సమాచారం. బాలకృష్ణ తీరుపై ఆయన అభిమానులే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దాంతో బాలకృష్ణ అభిమానులే ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టారు. అభిమానులు బాలకృష్ణ ప్లెక్సీలను తగలబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం.. మీరు ఓ లుక్కేయండీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri balakrishna  Balayya fans  Balakrishna flexies  Madhira  Khammam tour  viral video  

Other Articles