no parking fees for vehicle parking in theatres థియేటర్లలో పార్కింగ్ ఫీజు కట్టే అవసరం లేదు..

No parking fees for vehicle parking in theatres of telangana

theaters vehicle parking fees, hyderabad theaters, telangana goverment orders, maheshwari theater, court, penaltty, fine, violation of parking rules, parking rules, theaters, multiplex, theatre managment, hyderabad, telangana goverment

no parking fees for vehicle parking in theatres of hyderabad as telangana goverment has issued new orders. Maheshwari Theater had paid penalty in this regard for violating rules.

తెలుసా.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు కట్టే అవసరం లేదు..

Posted: 09/15/2018 12:05 PM IST
No parking fees for vehicle parking in theatres of telangana

హైదరాబాద్ లో సినిమా ధీయేటర్లు, మల్టీపెక్సుల్లోకి వెళ్లి సినిమాలు చేసే ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు పేరిట ఎలాంటి రుసుమును వసూలు చేయకూడదని కొన్న మాసాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పార్కింగ్ నిబంధనలు వచ్చి చాలా రోజులే అయ్యింది మాకు తెలుసులే.. అంటున్నారా.? అయితే ధియేటర్లకు వెళ్లి వాహనాల పార్కింగ్ ఫీజు ఎందుకు కడుతున్నారు.? ఔను.. ఎందుకు కడుతున్నాం అని అలోచనలో పడ్డారా.?

తాజా నిబంధనల ప్రకారం మాత్రం ధియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుడి నుంచి వాహనాల పార్కింగ్ పేరిట ఎలాంటి రుసుమును వసూళు చేయకూడదు. కానీ ధియేటర్ యాజమాన్యాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. పార్కింగ్ ఫీజు వసూలు చేసి ప్రేక్షకుడిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ గతేడాది జూలైలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్‌లో సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. కారు పార్కింగ్ కోసం సిబ్బంది అతడి నుంచి రూ.30 వసూలు చేశారు. నిబంధనలకు ఇది విరుద్ధమని నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారుల ఫోరం సదరు థియేటర్‌కు నోటీసులు పంపింది.

పార్కింగ్ ఫీజు లేకుంటే అందరూ వచ్చి ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, దానిని అరికట్టేందుకే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. థియేటర్‌లో సినిమా చూసినా, ఏదైనా కొనుగోలు చేసినా పార్కింగ్ ఫీజును తిరిగి ఇవ్వాలన్న నిబంధన ఉన్నా, విజయ్‌గోపాల్ నుంచి వసూలు చేసిన ఫీజును వెనక్కి ఇవ్వకపోవడం అక్రమమని ఫోరం పేర్కొంది. విజయ్ గోపాల్‌ను మానసిక ఒత్తిడికి గురిచేసినందుకు గాను రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై విజయ్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. మిగతా థియేటర్లకు ఇదో హెచ్చరిక కావాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parking rules  theaters  multiplex  maheshwari theater  managment  hyderabad  telangana goverment  

Other Articles