After Jagga Reddy, gandra its Revanth Reddy turn జగ్గారెడ్డి..గండ్రల తరువాత రేవంత్ రెడ్డి వంతు..

After jagga reddy gandra its revanth reddy turn notices issued to congress leader

Revanth Reddy, banjara hills, jubilee hills housing society, 2001 case, jubilee hills police notice to revanth reddy, jagga reddy, gandra venkat ramana reddy, gandra venkatramana reddy death warning case, errabelli ravinder rao, jagga reddy arrested, uttam kumar reddy, kuntia, congress, political vendata, trs, minority meet, arrest, telangana congress, telangana news, telangana politics

After Sangareddy Former MLA K Jagga Reddy arrest and case booked against congress senior leader and EX MLA Gandra venkatamana reddy, now its the turn of kondangal MLA Revanth Reddy, police issued notices against him and 13 others.

జగ్గారెడ్డి..గండ్రల తరువాత రేవంత్ రెడ్డి వంతు..

Posted: 09/12/2018 11:40 AM IST
After jagga reddy gandra its revanth reddy turn notices issued to congress leader

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు చేసిన పోలీసులు, ఆ మరుసటి రోజునే మరో కాంగ్రెస్ నేత గండ్ర వెంకట్రామణా రెడ్డితో పాటు ఆయన సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ తాజాగా మరో కాంగ్రెస్ నేత వంతు వచ్చింది. ఇటీవలి కాలంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ నేతకు పోలీసులు శ్రీముఖాలు పంపారు.

పూర్వపు మెదక్ జిల్లాల్లో జగ్గారెడ్డి అరెస్టుతో కాంగ్రెస్ కార్యకర్తలను డోలాయమానంలోకి నెట్టిన ప్రభుత్వం.. గండ్రపై కేసు నమోదు చేసి పూర్వపు వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలను అలోచనలో పడేసింది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంతో పాటు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావులపై అవకాశం దోరికినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడి.. తన వాగ్ధాటితో వారిని మౌనం వహించేలా చేస్తున్న కాంగ్రెైస్ నేత రేవంత్ రెడ్డి వంతు వచ్చింది.  

తాజాగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటిసులు అందించారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారన్న అభియోగాలపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఇది తాజాగా జరిగిన కేసు కాదు. ఏకంగా దశాబ్దమున్నర కాలానికి పైగా దాటిని నాటి కేసు. ఈ కేసును కూడా తాజాగా పోలీసులు తిరగదోడి.. రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

2001లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై దర్యాప్తును సాగిస్తున్న పోలీసులు ఈ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు అప్పటి అవకతవకల్లో పాలుపంచుకున్నారన్న అభియోగాలపై మొత్తంగా 13 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల వ్యవధిలో తమ ముందు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులలో పేర్కొనగా, తనకు మూడు వారాల గడువు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles