రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వినూత్న రీతిలో తన ప్రచారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ అభ్యర్థులను ఉత్కంఠకు గురిచేసిన తరువాత అభ్యర్థుల జాబితాలను వెలువరించే పార్టీలకు భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణకేనని ప్రకటించారు.
హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో జరిగిన సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రకటన చేశారు. వైసీపీ మాజీ నేత పితాని బాలకృష్ణకు పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా చేశారని, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది ‘పోలీస్ కులం’ అని చెప్పి నవ్వులు చిందించారు. పితానిని చూడగానే ఆయనకు టికెట్టు ఇవ్వాలనిపించిందని, ఆయన భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అందుకని, పితాని బాలకృష్ణను ‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
అనంతరం, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘వంచనకు గురైన తనకు ఎవరూ లేరని, తనను చిన్నచూపు చూశారని... పవన్ కల్యాణ్ మాత్రమే తనను ఆదరించి అక్కున చేర్చుకున్నారని.. ఈ పార్టీలో బాధ్యతలు అప్పజెప్పారని చెమ్మగిల్లిన కళ్లతో బావోద్వేగానికి గురైన పితాని తెలిపారు. అతి పేద కుటుంబం నుంచి వచ్చానని, చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకునే వాడిని. ఏదో భగవంతుడి దయవల్ల, అంచెలంచెలుగా ఎదిగా. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశానని చెప్పారు.
అమ్మోరు దయవల్ల.. ఐశ్వర్యం లభించిందని.. పది మందికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న తనను ఓ మోసపూరితమైన నాయకుడు వంచించాడన్నారు. తనకు టికెట్ ఇస్తాను రమ్మనమని చెప్పి.. తన ఉద్యోగానికి రాజీనామా చేయించాడని. నన్ను మోసం చేశాడని.. తన అవేదనను వ్యక్తం చేశారు. అదే క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఆలోచించాల్సిన అవసరం వుందని అన్నారు. విశ్వసనీయత, మాటతప్పడం, మడమ తిప్పడం..అనేవి పైకి షోయింగ్ లు తప్ప, లోపలంతా దుర్మార్గం, కుట్ర, కుతంత్రం. ఈ కౌగిలించుకోవడాలు, ముద్దుపెట్టుకోవడాలు అంతా మోసం.. ఎవరూ నమ్మకండి!’ అని ఘాటు విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more