BJP's Comical Charts on Fuel Price Hikes భారాన్ని గొప్పగా చాటుకునే ప్రయత్నం.. బొక్కబోర్లాపడ్డ అధికారపక్షం..

Bjp s charts on fuel hike show how difficult it is to defend high oil taxes

truth behind oil prices hike, arun jaitely,Bharat Bandh,BJP charts fuel prices,BJP Twitter handle,Brent crude,Congress,fuel prices,fuel tax,high oil taxes,international crude oil prices,Narendra Modi,NDA,petrol prices,UPA BJP, Congress, diesel prices, Fuel price hike, india fuel prices, Petrol Prices, Rajasthan, Rupee

BJP used questionable graphs and charts to imply that PM Modi’s government doesn’t need to act on skyrocketing fuel prices because things were supposedly worse under the previous governments.

భారాన్ని గొప్పగా చాటుకునే ప్రయత్నం.. బొక్కబోర్లాపడ్డ అధికారపక్షం..

Posted: 09/11/2018 03:40 PM IST
Bjp s charts on fuel hike show how difficult it is to defend high oil taxes

పెరుగుతున్న పెట్రోలు ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్రంలోని అధికార పక్షం మాత్రం తాము గత ప్రభుత్వాల కన్నా ఎంతో మేలని చాటుకునే ప్రయత్నం వారిని అబాసుపాలు చేసింది. ధరల పెంపు విషయంలో తమ ప్రభుత్వం గత యూపీఏ హయాం కంటే ఎంతో మేలని చాటుకునే ప్రయత్నం చేసింది. అక్షరాల పెద్దలు చెప్పినట్లు మసిపూసి మారేడు కాయ అని నమ్మించే అధికార పక్షం ప్రయత్నం బెడిసికొట్టింది.

అంతకంతకూ పెరుగుతూ ఆకాశాన్నంటే విధంగా దూసుకెళ్తున్న ఇంధన ధరలపై విపక్షాలు భారత్ బంద్‌ కూడా పాటించాయి. అయితే ఇదోదే తమ ప్రభుత్వంతోనే జరిగిందా.? గతంలోనే పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయని కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంతటితో అగకుండా నిజంగా ఎవరికైనా పూర్తి గణితశాస్త్రంపై అవగాహన, పట్టు వుంటే.. తమ ప్రధాని మోదీ హాయంలోనే ధరలు తగ్గాయని కొత్త వాదనకు తెరతీసింది.

అదెలా అంటే భారత్ బంద్ ను చేపట్టిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను దోషిగా చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసి కోట్టి.. బొక్కబోర్లా పడింది. బీజేపి చేసిన ప్రయత్నాలను నెటిజనులు బహుబాగా తిప్పికోట్టడంతో వ్యూహాత్మక మౌనాన్ని వహించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘పెట్రోలియం ధరల పెరుగుదలపై వాస్తవం ఇదీ' అంటూ ట్వీట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసిన బీజేపి అభాసుపాలైంది. భారీగా పెరిగిన పెట్రోలు ధర సూచీని తగ్గించి.. తక్కువ ఉన్న ధరల సూచీని ఎక్కువ చేసి చూపించింది.

పెట్రో ధరల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ను నిరసిస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో రెండు గ్రాఫ్‌లు పోస్టు చేసింది. వాటిలో ఢిల్లీలో మే 2014లో లీటరు పెట్రోలు ధరను రూ. 71.41గా చూపించింది. కానీ ఇప్పుడు మాత్రం రూ.80.73గా ఉన్నట్టు చూపించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ, రూ.80తో పోలిస్తే రూ.70 చాలా ఎక్కువని అర్థం వచ్చేలా రూ. 71.41 సూచీని బాగా పెంచేసి, రూ.80.73 సంకేతాన్ని బాగా తగ్గించి చూపించింది. రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  petrol  diessel  pm Modi  Rahul Gandhi  Bharat Bandh  UPA  NDA  

Other Articles