40 feared dead as RTC bus skids off road in Jagtial కొండగట్టులో ఆర్టీసీ బస్సు బొల్తా.. 35 మంది మృతి..

40 feared dead as rtc bus skids off road in jagtial

kondagattu bus accident, TSRTC bus accident, kondagattu rtc bus accident, kondagattu anjaneya swamy, jagtial, k chandrashekhar rao, kondagattu, p mahender reddy, TELANGANA BUS ACCIDENT, KCR, Kondagattu Hanuman, Telangana, crime

fourty persons including six children were feared killed and many others injured, some of them receiving serious wounds when a TSRTC bus went off a hillside road near Kondagattu in Jagtial district

కొండగట్టున ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బొల్తా.. 40 మంది మృతి..

Posted: 09/11/2018 12:53 PM IST
40 feared dead as rtc bus skids off road in jagtial

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగిత్యాలకు చేరువలోని కొండగట్టులో వున్న అంజనేయస్వామి దేవాలయానికి వెళ్తున్న భక్తులతో కిక్కిరిన బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని దాదాపు 40 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎనమిది మంది చిన్నారులు, 25 మంది మహిళలు వున్నారు. మరో 25 మంది క్షతగ్రాతులయ్యారు. క్షతగాత్రులను స్థానిక జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.. మరో ఎనమిది మందిని హైదరాబాద్, కరీంనగర్ అసుపత్రులకు తరలించారు. ఇంకా బస్సులో వున్నవారిని బయటకు తీసేందుకు సహాయకచర్యలు జరుగుతున్నాయి.

మంగళవారం కావడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి స్థానిక ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో 35 మంది చనిపోయారు. మృతుల్లో ఎనమిది మంది చిన్నారులే వున్నట్లు సమాచారం. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. మిగిలిన ప్రమాణికులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన భక్తులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం అందించారు.

బస్సు లోతుగా ఉన్న ప్రాంతంలోకి పల్టీలు కొట్టడంతో తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జగిత్యాలకు వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు చనిపోవడంతో పలువురు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, మృతుల్లో అత్యధికులు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందినవారే కావడంతో వారి బంధువులు, కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఇటు ఘటనాస్థలంలో. అటు జగిత్యాల అసుపత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే జగిత్యాల కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఈటల రాజేందర్.. క్షతగాత్రులకు చికిత్స అందించాలని జిల్లాలోని అన్ని ఆసుపత్రులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తామని తెలిపారు. బస్పు ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి మహేందర్ రెడ్డి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondagattu  Hanuman Temple  TSRTC Bus  Accident  KCR  Telangana crime  

Other Articles