CEO Rajath Kumar Over Early Polls Schedule ఎన్నికలకు సీఈసీ ఆదేశమే తరువాయి: రజత్ కుమార్

Ceo rajath kumar over early polls schedule

Telangana Chief secretary, SK Joshi, Chief Election Officer (CEO), Telangana CEO, Rajath Kumar, Governor, ESL Narasimhan, Early Polls Schedule, Telangana early polls, Telangana assembly Elections, KCR, BJP, TRS

Telangana Chief Secretaray SK Joshi Meets Chief Election Officer Rajath Kumar after his meeting with Governor ESL Narasimhan over Early Polls Schedule.

ITEMVIDEOS: ఎన్నికలకు సీఈసీ ఆదేశమే తరువాయి: రజత్ కుమార్

Posted: 09/04/2018 05:17 PM IST
Ceo rajath kumar over early polls schedule

తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని అనడానికి మరో సంకేతమిది. ఇప్పటికే ఇదే విషయమై ఫామ్ హౌస్ లో పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 7న జరగనున్న సభకు ముందు జరిగే రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెలువరిస్తారని కూడా సమాచారం. అన్ని కుదిరితే అదే రోజున అసెంబ్లీ రద్దు విషయాన్ని ప్రకటిస్తారా.? అన్న అనుమానాలు కూడా ఓ వైపు రేకెత్తుతున్నాయి.

ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా గవర్నర్ నరసింహన్ తో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగ రావులు భేటీ అయ్యారు. దీనికి ముందు సచివాలయంలో అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం జరగనున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇక దీనికి తోడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మలతో ఆయన వేర్వేరుగా సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీలపై చర్చించామని వారు ప్రకటిస్తున్నా.. వాస్తవానికి వీరి మధ్య ముందస్తు ఎన్నికల సన్నాహాలపైనా చర్చ జరిగినట్టు సెక్రటేరియట్ వర్గాల సమాచారం. ఈ వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే.. అప్పుడు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CS  SK Joshi  CEO  Rajath Kumar  Governor  Early Polls  KCR  BJP  TRS  

Other Articles