Congress ticket for those having strong hold in social media అక్కడ బలమైన బలగం వుంటేనే పార్టీ టికెట్లు: కాంగ్రెస్

Congress ticket for those who have 15 000 fb likes 5 000 twitter followers

congress, madhyra pradesh elections, madhya pradesh assembly elections, congress twitter, congress news, madhya pradesh polls, assembly elections, congress, social media, twitter, facebook, madhya pradesh, politics

In a letter to ticket aspirants ahead of the upcoming assembly elections, the Madhya Pradesh Congress Committee has made it mandatory for candidates to have a social media influence.

అక్కడ బలమైన బలగం వుంటేనే పార్టీ టికెట్లు: కాంగ్రెస్

Posted: 09/03/2018 04:50 PM IST
Congress ticket for those who have 15 000 fb likes 5 000 twitter followers

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే ఆశావహులకు కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో ఈ సారి కాంగ్రెస్ గెలుపొందుతుందన్న అంచనాలు తెరపైకి వస్తున్న క్రమంలో చాలా మంది కాంగ్రెస్ టికెట్లను పోందేందుకు బరిలో నిలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో బలమైన బలగం వుంటే తప్ప టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పింది. ప్రజలతో అనుసంధానం వుండటంతో పాటు నేటి యువత అధికంగా సోషల్ మీడియానే ఫాలో అవుంతుందని ఈ క్రమంలో అన్ లైన్ లో తగు బలం, బలగం చూపించిన నేతలకు మాత్రమే టికెట్లను ఇస్తామని స్పష్టం చేసింది.

దీంతో ఇన్నాళ్లు టికెట్ల వేటలో భాగంగా ఢిల్లీలోని గల్లీల చుట్టూ తిరేగ నాయకులు ఇక సోషల్‌ మీడియాలో తమ సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నారు. అటు షేస్ బుక్, ఇటు ట్విట్టర్ లలో భారీగా ఫాలోవర్లు పెంచుకునే ప్రయత్నాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఖాతాలు కలిగిఉండాలని వెల్లడించింది.

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను కలిగిఉండాలని, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది. వారంతా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పోస్టులను రీట్వీట్‌ చేయాలని, లైక్‌ కొట్టాలని కోరింది. పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని సూచించింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే నేతలంతా ఈనెల 15లోగా వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి అందచేయాలని కోరింది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సైబర్‌ సైనికులు, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్‌ సిపాయిలు నిమగ్నమయ్యారు. బీజేపీ ఇప్పటికే 65000 మంది సైబర్‌ సైనికులను రంగంలోకి దించగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున 4000 మంది రాజీవ్‌ సిపాయిలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు తమపై బురద చల్లితే సోషల్‌ మీడియా వేదికగా తాము తిప్పికొడుతున్నామని బీజేపీ, కాంగ్రెస్‌ ఐటీ విభాగం చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly elections  congress  social media  twitter  facebook  madhya pradesh  politics  

Other Articles