Chennai Mother Arrested for Poisoning Children ప్రియుడి మోజులో పడి.. చేయకూడని పని..

Extra marital affair leads chennai mother to poison children

Murder, arrest, Octopussy, Kundrathur, koyambedu, CCTV, abirami, Ajay, karunika, vijay, extra marital affair, kanyakumari, chennai police, crime

A merciless mother Abhirami (25) allegedly poisoned and killed her own children Ajay and Karunika. Husband Vijay a Private bank employee came home in the early hours noticed that his children dead.

కిరాతకురాలు.. ప్రియుడి మోజులో పడి..

Posted: 09/03/2018 02:56 PM IST
Extra marital affair leads chennai mother to poison children

ఓ దుకాణం ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్తను, బిడ్డలనూ హత్య చేయాలని ప్లాన్ చేసి, బిడ్డలను మాత్రమే చంపిన కసాయి తల్లి అభిరామిని నాగర్ కోవిల్ వద్ద తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తమిళనాడులో కలకలం సృష్టించగా, ఆమె ప్రియుడు సుందరం ఇచ్చిన సమాచారంతో అభిరామిని అరెస్ట్ చేశారు పోలీసులు. బిడ్డలను హత్య చేసిన తరువాత అభిరామిని తానే నాగర్ కోయిల్ బస్సు ఎక్కించానని సుందరం చెప్పగా, ఆ కోణంలో విచారించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలను హత్య చేసిన రోజు, భర్త ఆలస్యంగా ఇంటికి రావడమే అతని ప్రాణాలను కాపాడిందని, భర్త విజయ్ కుమార్ ను చంపేందుకు కూడా నిర్ణయించుకున్న ఆమె, పాలల్లో విషం కలిపి సిద్ధంగా ఉంచుకున్నప్పటికీ, విజయ్ కుమార్ రాలేదని, దీంతో తెల్లవారుజామున ఆమె ప్రియుడితో కలసి పారిపోయిందని పోలీసులు తెలిపారు. తాము సుందరాన్ని విచారిస్తున్న సమయంలోనే అభిరామి నుంచి అతనికి ఫోన్ వచ్చిందని, ఆ తరువాత సుందరంతో ఆమెకు కాల్ చేయించి, నాగర్ కోవిల్ బస్టాండు వద్దకు రప్పించి అరెస్ట్ చేశామని తెలిపారు.

భర్తపై విముఖత, ప్రియుడిపై ఏర్పడిన వ్యామోహంతో భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు హంతకురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. తన భర్త సరిగా ఇంటికి రాడని, అంతేకాకుండా తనను అనుమానించేవాడని తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని విచారణలో పేర్కొంది. ప్రస్తుతం అభిరామిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murder  arrest  Octopussy  Kundrathur  koyambedu  CCTV  abirami  Ajay  karunika  vijay  extra marital affair  kanyakumari  chennai police  crime  

Other Articles