drunk and drive test conducted to rtc lady conductor లేడీ కండక్టర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలా.?

Drunk and drive test conducted to rtc lady conductor

police constable, lady conductor, simhachalam bus depot, APSRTC, drunk and drive test, Instuctions, RTC MD, Surendra babu, apology, breath analyzer, constable feels guilty, Viral news, andhra pradesh

A constable in APSRTC of simhachalam depot conducts drunk and drive test to lady conductor, this photo goes viral on net

లేడీ కండక్టర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలా.?

Posted: 09/03/2018 02:24 PM IST
Drunk and drive test conducted to rtc lady conductor

తాగి వాహనాలు నడిపిస్తే దారి మధ్యలో కాపుకేసే పోలీసులు తమ వద్దనున్న బ్రీత్ అనటైజర్లతో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వారికి కౌన్సిలింగ్, లేదా కోర్టులో హాజరుపర్చడం పరిపాటి. అయితే ఈ మధ్యకాలంలో రైలు నడిపే లోకో పైలెట్లు కూడా మద్యం సేవించి రైలు నడుపుతు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్లతో పాటు.. కండక్టర్లకు కూడా బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించిన అనంతరమే వారికి వాహనాలను అప్పగించాలన్న అదేశాలు వచ్చాయి.

ఇంతవరకు బాగానే వున్నా.. డ్రైవర్లతో పాటు కండక్టర్లకు కూడా పరీక్షలు చేయడం ప్రారంభించడంతో.. తమకు స్పష్టమైన అదేశాలు రానందున తాము తన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఓ కానిస్టేబుల్ అతి చేశాడు. ఏకంగా విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ మహిళా కండక్టరుకు కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాడు. అమె మధ్య సేవించలేదని నిర్థారించుకున్నాకే అమెకు కండక్టర్ బాధ్యతలను అప్పగించేందేకు రెడీ అని చెప్పి.. ఎట్టకేలకు అమెకు క్షమాపణలు చెప్పాడు.

ఎక్కడా అంటే.. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆర్టీసీ డిపోలో ఓ మహిళా కండక్టరుకు కానిస్టేబుల్ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశాడు. దీనిని ఎవరో ఫోటో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ కు చీవాట్లు పెట్టారు. ఓ మహిళా కండక్టరుకు ఈ పరీక్షలు చేయడంపై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సదరు కానిస్టేబుల్ తో మహిళా కండక్టరుకు క్షమాపణలు చెప్పించారు.

ఇటువంటి ఘటన పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాస్తవానికి ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లు బస్సును బయటకు తీసే సమయంలో బ్రీత్ అనలైజర్ పరీక్షలు తప్పనిసరి. కండక్టర్లకూ ఈ పరీక్షలు చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆ కానిస్టేబుల్ ఇతర కండక్టర్లతో పాటు ఆమెకూ పరీక్షలు చేశాడు. అయితే బయట కొందరు అమ్మాయిలు మద్యం సేవించి అడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారన్నది వాస్తవం. అయితే సంస్థలో లేడీ కండక్టర్లుగా ఉద్యోగాలు చేసే వారిని కూడా ఇలా అనుమానించి పరీక్షించడం ఏంటని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles